Tribanadhari Barbarik OTT Streaming Date:డిఫరెంట్ కంటెంట్, ప్రయోగాత్మక చిత్రాల్ని జనాలు ఆదరిస్తూనే ఉంటారనడానికి పలు నిదర్శనలున్నాయి. కొన్ని సినిమాలను ప్రేక్షకులు థియేటర్లో మిస్ అయిన వాటిని ఓటీటీ వేదికగా టీవీల్లో చూడడానికి ఇష్టపడుతున్నారు. తాజాగా థియేట్రికల్ గా ఓ మోస్తరుగా ప్రజల నోళ్లలో నానిన‘త్రిబాణధారి బార్బరిక్’ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, సన్ నెక్ట్స్ ఫ్లాట్ ఫాంలో అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయ భాను, సాంచీ రాయ్, క్రాంతి కిరణ్ వంటి వారు ఈ చిత్రంలో నటించారు. ఈ మూవీకి ఇన్ ఫ్యూజన్ బ్యాండ్ సంగీతాన్ని అందించడం విశేషం. చాలా ఏళ్లకు ఉదయభాను ఈ సినిమా కనిపించడం, నటించడం, మాస్ సాంగ్‌కు స్టెప్పులు వేయడంతో జనాల్లో ఎక్కువ ఆసక్తి రేకెత్తించింది.
టెక్నికల్‌గా మూవీ హై స్టాండర్డ్స్‌లో ఉందని అందరూ ప్రశంసించిన సంగతి తెలిసిందే. మేకర్ మోహన్ శ్రీవత్సకు, నిర్మాత విజయ్ పాల్ రెడ్డికి ‘త్రిబాణధారి బార్బరిక్’ అయితే మంచి పేరును తీసుకొచ్చింది. ఇక రిలీజ్ సమయంలో దర్శకుడు తీవ్ర భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. థియేటర్లో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసి ఆస్వాధించే సమయం వచ్చింది. అందరినీ ఆకట్టుకునే ఈ హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను తప్పకుండా చూడండి.
త్రిబాణధారి బార్బరిక్ లో బాహుబలి ఫేమ్ కట్టప్ప ముఖ్యపాత్రలో నటించాడు. ఈయన అంతకు ముందు తమిళ సినీ రంగంలో విలన్ గా నటించిన ఆపై హీరోగా పలు సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ లో కట్టప్పగా తన నటనతో మెప్పించడం విశేషం.
Read more: గోవా నుంచి మన రాష్ట్రానికి ఎంత మద్యం తీసుకురావచ్చో తెలుసా..! చట్టం ఏం చెబుతోందంటే..
Read more: మన దేశంలో అత్యంత సంపన్న మంత్రులు వీళ్లే.. లిస్టులో తెలుగు వాళ్లే టాప్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









