Triguni: నర బలుల నేపథ్యంలో వస్తోన్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘త్రిగుణి’.. సెన్సార్ పూర్తి..

Triguni Censor Report: తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో వస్తోన్న మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘త్రిగుణి’. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 14, 2025, 08:14 PM IST
 Triguni: నర బలుల నేపథ్యంలో వస్తోన్న  డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘త్రిగుణి’.. సెన్సార్ పూర్తి..

Triguni: MMW బ్యానర్‌పై శ్రీమతి మహేశ్వరి నిర్మాణంలో తెరకెక్కిన రెండో చిత్రం "త్రిగుణి". తాజాగా ఈ సినిమా  సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అంతేకాదు త్వరలో  తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రానికి వైతాహవ్య వడ్లమాని  దర్శకత్వం వహించారు.  రుద్రపట్ల వేణుగోపాల్  ప్రాజెక్ట్ హెడ్‌గా వ్యవహరించారు. లీడ్ రోల్లో కుషాల్,  ప్రేరణ చౌదరి  నటించారు.నరబలుల నేపధ్యంలో ఈ హారర్-థ్రిల్లర్ చిత్రం తెరకెక్కించారు.

Add Zee News as a Preferred Source

అంతేకాదు  సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. అంతేకాదు  బోర్డు సభ్యుల నుండి ఈ సినిమాకు ప్రత్యేక  ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమా  మధ్యప్రదేశ్ టూరిజం బోర్డు వారి సంపూర్ణ సహకారం తో మధ్యప్రదేశ్‌ రాష్ట్రం లోనే  పూర్తిగా  చిత్రీకరించబడిందని చిత్ర యూనిట్ తెలిపింది.

మధ్యప్రదేశ్ టూరిజం విభాగంలోని AMD శ్రీమతి బిదిషా ముఖర్జీ, డెప్యూటీ డైరెక్టర్ శ్రీ రామ్ తివారి, ఇతర అధికారులకు త్రిగుణి బృందం ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. దర్శకుడు వైతాహవ్య మాట్లాడుతూ, స్థానిక నటులు, సంస్కృతి, ప్రకృతి అందాలు చిత్రానికి కొత్తదనాన్ని ప్రత్యేకతను అందిచాయన్నారు.

తమ తొలి చిత్రం "అరంగేట్రం" మంచి విజయం తర్వాత .. MMW బృందం "త్రిగుణి" కూడా ప్రేక్షకుల నుండి అదే స్థాయిలో ఆదరణ పొందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నిర్మాత శ్రీమతి మహేశ్వరి మాట్లాడుతూ.. ఈ చిత్రం ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కథా రచయిత వంశీ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథన శైలి ప్రేక్షకులను మొదటి నుంచి చివర వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News