)
Trimukha Release on December: అఖీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ మోహన్, శ్రీవల్లి సమర్పణ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా ‘త్రిముఖ’ మూవీ రాబోతుంది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు దసరా సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక చిత్రాన్ని విడుదల చేయడంతో పాటు డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తైయింది. కొన్ని ప్యాచ్ వర్క్స్ మినహా పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు పెండింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలో ఫస్ట్ కాపీ రెడీ చేసి సెన్సార్ కు పంపంచనున్నారు.
ఈ చిత్రంలో సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆమెతో పాటు యోగేష్ కల్లే, ఆకృతి అగర్వాల్, CID ఆదిత్య శ్రీవాస్తవ, ప్రవీణ్, శకలక శంకర్, ముట్టా రాజేంద్రన్, ఆశూ రెడ్డి, సుమన్, రవి ప్రకాష్, సహితి, సూర్య, జీవ, జెమినీ సురేష్ తదితరులు నటిస్తున్నారు.
రజేశ్ నాయుడు, షేక్ రబ్బానీ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేను అందించారు.ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి పిక్చరైజ్ చేశారు. మిగిలిన మూడు భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. మొత్తం సినిమా బడ్జెట్ రూ. 14 కోట్ల నుండి రూ. 15 కోట్లుగా అయ్యే అవకాశాలున్నాయి. ‘త్రిముఖ’ అద్భుతమైన స్థాయిలో తెరకెక్కిందని చిత్ర యూనిట్ తెలిపింది. మా నటీనటుల ప్రతిభ, దర్శకుడి విజన్, సాంకేతిక బృందం కృషి – ప్రతి ఫ్రేమ్ అంచనాలకు మించిపోయేలా ఉందన్నారు. ఈ డిసెంబర్లో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందనే మాకు పూర్తి నమ్మకం ఉందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సన్ని లియోన్ విషయానికొస్తే.. హిందీ బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పరిచయమై బాలీవుడ్ చిత్ర సీమలో అడుగుపెట్టింది. అక్కడ శృంగార చిత్రాల కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘కరెంట్ తీగ’తో చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో ‘గరుడ వేగ’తోపాటు జిన్నా సహా పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.