)
Trisha Mahesh Babu College Days
తమిళంతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా.. తనదైన శైలిలో రాణిస్తున్న నటి త్రిష కృష్ణన్. ప్రస్తుతం 42 ఏళ్ల వయస్సులో ఉన్నప్పటికీ.. ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చేతినిండా అవకాశాలతో ముందుకు సాగుతున్న త్రిష, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
త్రిష మాట్లాడుతూ, “మేమిద్దరం కాలేజీలో చదువుకునే రోజుల్లోనే పరిచయం అయ్యాం. మహేష్ బాబు ఆ సమయంలో పెద్ద హీరో కాకపోయినా, మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడింది. నటీనటులమవుతామని అప్పుడు ఊహించలేదు. కానీ ఇప్పుడు అతడే నాకు ఇష్టమైన హీరో” అని చెప్పింది.
తాను మహేష్‌తో కలిసి నటించిన చిత్రాల గురించి మాట్లాడుతూ, అతడు సినిమా వారి మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుందో చూపిందని చెప్పింది. అంతేకాదు, సైనికుడు వంటి చిత్రాల్లో కూడా ఆమె మహేష్ బాబుతో నటించింది. ఈ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఇప్పటికీ మహేష్ బాబు తన ఫేవరేట్ హీరోలలో ఒకరని త్రిష చెప్పిన మాటలు ఫ్యాన్స్‌కి ఎంతో ఆనందం కలిగించాయి. రెండు దశాబ్దాలకు పైగా నటనా జీవితంలో కొనసాగుతూ.. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోను తనదైన ముద్ర వేసిన త్రిష, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర అనే సినిమాలో నటిస్తోంది. ఆమె నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ, విదాముయార్చి వంటి తమిళ సినిమాలు ఇప్పటికే హిట్స్‌గా నిలిచాయి.
అయితే ఈ మధ్య త్రిష మణిరత్నం దర్శకత్వంలో నటించిన థగ్ లైఫ్ మాత్రం కొన్ని వివాదాలు తీసుకొచ్చింది. అందులో ఆమె షుగర్ బేబీ అనే పాటలో నటించగా.. త్రిష కు ఈ వయసులో ఇలాంటి సాంగ్ అవసరమా అని సినిమా విడుదల ముందే విమర్శలు వచ్చాయి. ఇక సినిమా విడుదల తర్వాత కూడా ఈ చిత్రంలో త్రిషా క్యారెక్టర్ పై ఎన్నో విమర్శలు రాసాగాయి. ముఖ్యంగా కమల్ హాసన్,సింబు ఇద్దరికీ కూడా ఆమె హీరోయిన్గా నటించడంతో.. వాళ్ళిద్దరిది ఆ సినిమాలో దాదాపు తండ్రి, కొడుకుల లాంటి రిలేషన్ కావడంతో.. అసలు త్రిష ఎలా ఎలాంటి పాత్ర ఒప్పుకుంది అంటూ ప్రశ్నించసాగారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook