Keerthy Suresh Out Of Nithiin Film : తెలుగు సినీ పరిశ్రమలో హీరో నితిన్ కి ప్రత్యేక పేరున సంగతి తెలిసిందే. 'జయం'తో కెరీర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత దిల్ సినిమాతో స్టార్ హీరోగా ఎదిగారు. ఇక మొదట్లో వరుస విజయాలు అందుకున్న నితిన్ ఆ తర్వాత దాదాపు 14 ఫ్లాప్ సినిమాలలో నటించారు. అయినా కానీ అతని క్రేజ్ ఏమీ తగ్గలేదు. ఆ తర్వాత ఇష్క్ సినిమాతో మళ్ళీ విజయం సాధించావు. కానీ ఇటీవల కాలంలో మరోసారి..వరుస ఫ్లాప్ సినిమాలతో అతని కెరీర్ నత్తనడక నడుస్తోంది. దీనికితోడు, కొత్త సినిమాల కోసం హీరోయిన్ ఎంపిక చేయడంలో.. ఎదురవుతున్న సమస్యలు నితిన్ ని ఇంకా సతమతం చేస్తున్నాయంట.
2020లో ‘భీష్మ’ మూవీతో ఓ మోస్తరు విజయం అందుకున్నప్పటికీ, తర్వాత వచ్చిన ‘చెక్’, ‘రంగ్‌దే’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘రాబిన్‌హుడ్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో నితిన్ మీద ఓ ‘బ్యాడ్‌లక్’ ముద్ర పడిపోయిందన్నట్టుగా అభిమానులు నిరాశ చెందుతున్నారు.
ఈ క్రమంలో..తాజాగా నితిన్ నటిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రానికి డైరెక్టర్‌గా ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి వ్యవహరిస్తుండగా, ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయిపల్లవిని అనుకున్నారు కానీ డేట్స్ సమస్యతో ఆమె చివర్లో నితిన్ కి.. హ్యాండ్ ఇచ్చింది. ఆపై కీర్తి సురేష్‌కి కూడా ఆఫర్ వెళ్లినప్పటికీ, ఆమె కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఈ సినిమా నుంచి.. ప్రస్తుతం తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఫిల్మ్ నగర్ వర్గాల్లో వైరల్ అవుతున్న వార్త ప్రకారం, డేట్స్ కారణం కంటే ఎక్కువగా నితిన్‌కి వరుస ఫ్లాపులు వస్తుండటమే హీరోయిన్లు వెనక్కి.. తగ్గడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ సమయంలో నితిన్‌తో జోడీగా నటిస్తే వారి కెరీర్‌కు కూడా నష్టం కలిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దానికి ఇలా ఇద్దరు హీరోలు కూడా నితిన్ కి హ్యాండ్ ఇచ్చారు.
నితిన్ త్వరలో ‘తమ్ముడు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దర్శకుడు వేణు శ్రీరామ్, నిర్మాత దిల్ రాజు – ఇద్దరి కలయికపై నితిన్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఫ్యామిలీ ఎమోషన్.. మాస్ ఎలిమెంట్స్ కలిపిన ఈ సినిమా ద్వారా అయినా నితిన్ తిరిగి పుంజుకుంటాడా అన్నది వేచి చూడాలి.
Also Read: Group 1 Posts: తెలంగాణ గ్రూప్-1 పోస్టుల భర్తీపై బిగ్ ట్విస్ట్.. రంగంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్
Also Read: Diesel Subsidy: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. డీజిల్ ధరపై రూ.9 తగ్గింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి








