)
Upasana Pregnancy : రామ్ చరణ్.. ఉపాసన పెళ్లైన ఎన్నో సంవత్సరాలకు.. ఉపాసన మొదటిసారి ప్రెగ్నెంట్ అయి ఈ మధ్యనే క్లిం కారాకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి రాంచరణ్ కి మగ బిడ్డ ఎప్పుడు పుడతారు అని కూడా ఆయన అభిమానులు ఎదురు చూడటం మొదలుపెట్టారు.
ఈ క్రమంలో వారి ఆశలు త్వరలోనే నెరవేరేలాగా కనిపిస్తున్నాయి. తాజాగా ఉపాసన తను ప్రెగ్నెంట్ అంటూ దీపావళి సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పేసింది.
అసలు విషయానికి వస్తే.. ఉపాసన దీపావళి రోజు ఇంట్లో వాళ్ళందరితో శ్రీమంతం లాంటి చిన్న ఫంక్షన్ జరుపుకుంటూ వీడియో తీసుకొని.. ఆ వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. తను మళ్ళీ ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని బయట పెట్టేసింది.
ఈ దీపావళికి డబుల్ సెలబ్రేషన్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ అవుతూ రామ్ చరణ్ అభిమానుల్లో ఆనందాన్ని తీసుకొస్తుంది.
దీంతో మెగా అభిమానులు అందరూ జూనియర్ లయన్ రావడానికి సిద్ధంగా ఉన్నారు అని కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇక ఈ సంబరాల్లో మెగా ఫ్యామిలీ మొత్తం కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ అవుతూ అందరిని తెగ ఆకట్టుకుంటుంది.
మరోపక్క రామ్ చరణ్ పెద్ది సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. బుచ్చి బాబుసాన దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి.. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.