Vakeel Saab collections: వకీల్ సాబ్ బాక్సాఫీస్ రేసులో దూసుకుపోతున్నాడు. తెలంగాణ, ఏపీ.. రెండు రాష్ట్రాల్లోనూ కొవిడ్-19 మార్గదర్శకాలు, ఆంక్షలు, టికెట్ ధరలు ఏవీ వకీల్ సాబ్ మూవీ కలెక్షన్స్‌పై ప్రభావం చూపించలేకపోయాయని తెలుస్తోంది. వకీల్ సాబ్ మూవీ రివ్యూకి (Vakeel Saab movie review) ఎలాగైతే పాజిటివ్ స్పందన కనిపించిందో.. అలాగే కలెక్షన్స్‌లోనూ ఆ ట్రెండ్ కనిపిస్తోందంటున్నాయి బాక్సాఫీస్ వర్గాలు. టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం తొలి మూడు రోజుల్లోనే.. అంటే ఫస్ట్ వీకెండ్‌లోనే వకీల్ సాబ్ మూవీ దాదాపు రూ. 100 కోట్లకుపైగానే వసూలు చేసినట్టు సమాచారం. ఏపీలో కలెక్షన్స్ బాగా వసూలు కాగా అలాగే యూఎస్, యూకే లాంటి ఓవర్సీస్ మార్కెట్‌లోనూ వకీల్ సాబ్ మూవీకి మంచి స్పందన కనిపించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి మూడు రోజుల్లోనే వకీల్ సాబ్ మూవీకి నిర్మాతలు పెట్టిన పెట్టుబడి వచ్చేసినట్టు ఫిలింనగర్ టాక్. అయితే, వకీల్ సాబ్ మూవీ కలెక్షన్స్‌పై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మొత్తానికి బాలీవుడ్‌లో 2016లో వచ్చిన కోర్టు డ్రామా పింక్ మూవీకి తెలుగు రీమేక్‌గా వచ్చిన వకీల్ సాబ్ మూవీ నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), బోనీ కపూర్‌ల పంట పండించిందన్నమాట. 


Also read : Vakeel Saab Movie Review, Highlights and Rating in Telugu: వకీల్ సాబ్ మూవీ రివ్యూ, రేటింగ్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, హైలైట్స్


అలాగే కోలీవుడ్‌లో అదే రోజున ధనుష్ హీరోగా రిలీజైన కర్ణన్ మూవీకి సైతం తమిళ ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ఆ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ. 63 కోట్లు వసూలు చేసినట్టు కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook