Sivangi: ఇప్పటికే పోస్టర్స్, టీజర్ తో ‘శివంగి’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా 'శివంగి' ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఆద్యంతం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. అందరి జీవితంలో గుడ్ డే, బ్యాడ్ డే అని ఒక రోజు వుంటుంది. కానీ నా జీవితంలో రెండూ ఒకే రోజు జరిగాయినిఆనంది చెప్పిన డైలాగ్ తో ఈ ట్రైలర్ ను ఓపెన్ చేశారు. ఓవరాల్ గా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఎంతో గ్రిస్పీగా ఈ ట్రైలర్ సాగింది. వరలక్ష్మి శరత్‌కుమార్ కు ఆనందిని విచారించడం చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది.
ఆనంది జీవితంలో జరిగిన విషయాలు చాలా సస్పెన్స్ ఫుల్ గా స్క్రీన్ పై ప్రజెంట్ చేశారు. సత్యభామ క్యారెక్టర్ లో ఆమె పెర్ఫార్మెన్స్ అదిరిపోయిందనే చెప్పాలి. సత్యభామరా .. సవాల్ చేయకు చంపేస్తా' అనే డైలాగ్ బాగుంది. వరలక్ష్మిశరత్‌కుమార్ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించింది. డైరెక్టర్ దేవరాజ్ భరణి ధరన్ డిఫరెంట్ స్టొరీ తో ప్రేక్షకులని అలరించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. A.H కాషిఫ్ - ఎబినేజర్ పాల్ మ్యూజిక్, భరణి కె ధరన్ కెమరా వర్క్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను కలిగించేలా ఉన్నాయి.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
వరలక్ష్మి శరత్ కుమార్ విషయానికొస్తే.. తెలుగు, తమిళంలో డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలతో అలరిస్తోంది. తన సినిమాలకు సంబంధించి ఢిఫరెంట్ వేలో ప్రయాణం చేస్తోంది. మార్చి 7 ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చూడాలి.
దర్శకత్వం: దేవరాజ్ భరణి ధరన్
నిర్మాత: నరేష్ బాబు పి
సంగీతం:A.H కాషిఫ్ - ఎబినేజర్ పాల్
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : భరణి కె ధరన్
ఆర్ట్: రఘు కులకర్ణి
సింగర్:సాహితీ చాగంటి
సాహిత్యం: శ్రీనివాస్ కామేపల్లి, దేవరాజ్ భరణి ధరన్
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









