Shivangi Streaming on AHA: వరలక్ష్మి శరత్‌కుమార్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ శివంగి. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గత నెల 7వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఫస్ట్ కాపీ మూవీస్ పతాకంపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించారు. థియేటర్ ప్రేక్షకులను మెప్పించిన ఈ మూవీ ఇప్పుడు భవానీ మీడియా ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. రేపటి నుంచి తమిళ వర్షన్ స్ట్రీమింగ్ కానుంది.
వరలక్ష్మి శరత్‌కుమార్, ఆనంది తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఎమోషనల్‌గా, పవర్‌ఫుల్‌గా పర్ఫామ్ చేసి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ప్రతి సీన్ సస్పెన్స్‌తో ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురిచేసింది. ఓ గ్రిప్పింగ్ అనుభూతిని ఇస్తుంది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఉత్కంఠ భరితంగా సాగే స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది.
కథ ఏంటంటే..?
సత్యభామ (ఆనంది) ఓ సామాన్య గృహిణిగా ఉంటుంది. ఆమె జీవితంలో అంతులేని దుఃఖాలు ఉంటాయి. ఓ వైపు భర్తకు అనారోగ్యం.. మరోవైపు ఆర్థిక సమస్యలతో ఆమె తీవ్ర కష్టాల్లో ఉంటుంది. వీటన్నికి తోడు అత్త నుంచి వేధింపులు.. ఇంకోవైపు తల్లిదండ్రులు అనుకోకుండా వరదల్లో చిక్కుకు పోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటుంది. ఏం చేయాలో పాలుపోక చివరికి పోలీసులను ఆశ్రయిస్తుంది. సత్యభామ పోలీసులను ఎందుకు ఆశ్రయించింది..? ఎవరైనా హత్యకు గానీ.. ఆత్మహత్యకు గానీ గురయ్యారా..? సత్యభామ తనకు ఎదురైన సమస్యలను ఎలా అధిగమించిందనేది తెలియాలంటే శివంగి సినిమాను ఆహాలో చూసేయండి.
Also Read: Lion Video: అడవిలో సింహానికే చుక్కలు చూపించిన గద్దలు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









