)
Constable Trailer: తెలుగులో పోలీస్ నేపథ్యంలో వచ్చిన చిత్రాలకు ఎపుడు గిరాకీ ఉంటుంది. ఒక్క తెలుగులోనే కాదు అన్ని భాషల్లో పోలీస్ ఓరియంటెడ్ చిత్రాల్లో కంటెంట్ బాగుంటే వాటిని ఆదరించిన సందర్భాలున్నాయి. ఈ కోవలో వరుణ్ సందేశ్ .. ‘కానిస్టేబుల్’ వంటి మాస్ కమర్షియల్ హీరోగా కొత్త ఇమేజ్ ను సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్సాన్స్ వచ్చింది. తాజాగా ఇతను ‘కానిస్టేబుల్’ వంటి సెన్సిబుల్ చిత్రంతో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ కు 3 మిలియన్ పైగా వ్యూస్ తో దూసుకుపోతుంది. అంటే 30 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన మధులిక వారణాసి కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని బలగం జగదీష్ ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మించారు. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ కు మంచి రెస్సాన్స్ రావడం సంతోషదాయకం అన్నారు. సినిమా సస్పెన్స్ తో పాటు ప్రతి సీన్ థ్రిల్లింగ్ గా ప్రతి ఒక్కరికి నచ్చే విదంగా తెరకెక్కించారన్నారు. ఈ చిత్రంలో క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు ఇందులో ఒక మంచి మెసేజ్ ఉంటుందని చెప్పారు.
దర్శకుడు ఆర్యన్ సుభాన్ మాట్లాడుతూ., "ట్రైలర్ కు విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం. మేము అనుకున్న దానికంటే అత్యధిక స్పందన రావడం విశేషం అన్నారు. ఇలాగే మా సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, మధులిక వారణాసి, దువ్వాసి మోహన్, బలగం జగదీష్, ప్రభావతి, కల్పలత, సూర్య, రవి వర్మ, మురళీధర్ గౌడ్, నిత్య శ్రీ, శ్రీ భవ్య తదితరులు నటించారు.
ఈ చిత్రానికి హజరత్ షేక్ (వలి) సినిమాటోగ్రఫీ అందించారు. సుభాష్ ఆనంద్ మ్యూజిక్ అందించారు. వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. B. G. M: గ్యాని, ఆర్ట్: వి. నాని, పండు మాటలు :శ్రీనివాస్ తేజ, పాటలు: రామారావు అందించారు. శ్రీనివాస్ తేజ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మిట్టపల్లి జగ్గయ్య , సీ.హెచ్ రాజ్ కుమార్, సహ నిర్మాతలు: : బి నికిత జగదీష్, కుపేంద్ర పవార్, నిర్మాత : బలగం జగదీష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఆర్యన్ సుభాన్ SK.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.