
Vayuputra First Look Poster: మన సనాతన సంప్రదాయంలో చరిత్ర, ఇతిహాసాలకు కొదవలేదు. అందులో వాయుపుత్రుడైన హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, కృప, పరశురామ, విభీషణుడు, హనుమంతుడు ఈ ఏడుగురు సప్త చిరంజీవులుగా మన పురాణాలు కీర్తిస్తున్నాయి. ఇక సప్త చిరంజీవుల్లో ఒకరైన హనుమంతుడు.. తన బుద్ధి, బలం, యశస్సు, భక్తితో కాలాన్ని అధిగమించిన శాశ్వత యోధుడు. అలాంటి గొప్ప యోధుడి కథతో 'వాయుపుత్ర' చిత్రం తెరకెక్కుతోంది. ఇది పర్వతాలను కదిలించిన భక్తి కథ కూడా. ఇది తరాలను తీర్చిదిద్దిన ప్రేరేపించిన హనుమంతుడి అచంచల విశ్వాసం నేపథ్యంలో రామాయణ ఇతిహాసంతో తెరకెక్కుతోంది.
చందూ మొండేటి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ నిర్మిస్తున్నారు. శ్రీకర ప్రొడక్షన్స్ సమర్పకులు వ్యవహరిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం.. చరిత్ర, భక్తి, ఆధునిక దృశ్యాల యొక్క ఉత్కంఠభరితమైన కలయికతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీస్థాయిలో 3D యానిమేషన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న 'వాయుపుత్ర', హనుమంతుని కాలాతీత కథను గొప్ప దృశ్య కావ్యంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2026 దసరాకు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
NAGA VAMSI - CHANDOO MONDETI JOIN FORCES: ANNOUNCE 'VAYUPUTRA' – A DEVOTIONAL 3D ANIMATION EPIC – DUSSEHRA 2026 RELEASE... Director #ChandooMondeti and producer #SuryadevaraNagaVamsi [#SitharaEntertainments] unite for #Vayuputra, a #3D animation cinematic experience.
Bringing… pic.twitter.com/8tlBfox7Ab
— taran adarsh (@taran_adarsh) September 10, 2025
‘వాయుపుత్ర’ మూవీ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అట్రాక్ట్ చేస్తోంది. హనుమంతుడు కొండపై నిలబడి, దహనమవుతున్న లంకను చూస్తున్న శక్తివంతమైన పోస్టర్ ను విడుదల చేశారు. రామాయణంలో రాముడితో పాటు హనుమంతుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఒక కాదు, థియేటర్లను దేవాలయాలుగా మార్చే పవిత్ర దృశ్యం. మునుపెన్నడూ లేని విధంగా భక్తి పారవశ్యంలో ముంచేయడానికి ప్రేక్షకులను ఆహ్వానిస్తోంది. 'వాయుపుత్ర' ఒక సినిమాటిక్ మైలురాయిగా ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేసారు మూవీ మేకర్స్.
కథకుడిగా చందూ మొండేటి ‘కార్తికేయ’ కార్తికేయ 2 చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. మన పురాణా ఇతిహాసాలపై ఆయనకున్న పట్టును ఈ సినిమాలు చూపిస్తున్నాయి. అలాంటి దర్శకుడి చేతిలో ‘వాయుపుత్ర’ మూవీ ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందనేది చూడాలి. ‘వాయుపుత్ర’ సినిమాతో పాటు త్వరలో ‘మురుగన్’ స్టోరీని ఓ స్టార్ హీరోతో తెరకెక్కించబోతున్నారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమాను 3Dలో తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. ఇందులో నటించే నటీనటులు ఎవరనేది చూడాలి. లేకపోతే పూర్తిగా యానిమేషన్ లో తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.