VD 14- Vijay Devarakonda: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ద‌ర్శ‌కుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేష‌న్‌లో గ‌తంలో టాక్సీవాలా మూవీతో మంచి హిట్ సాధించింది. ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా వీళ్ల కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా అనౌన్స్ చేసారు. ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 అనౌన్స్ అయ్యింది.  పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనున్న‌ట్టు ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది.  నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. వీడీ 14 అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన ఓ వీరుడి విగ్రహం ఉంది. దాని మీద ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా  ఈ పోస్ట‌ర్‌లో ఉంది. 19వ శ‌తాబ్దం నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమాను  పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్న‌ట్టు చెప్పారు.  'డియర్ కామ్రేడ్', 'ఖుషి' వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలయిక‌లో వ‌స్తోన్న మూడో చిత్రమిది. 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు.



ప్రేక్షకులకు ఒక ఎపిక్ లాంటి ఎక్సీపీరియన్స్ ఇవ్వనుందీ సినిమా. త్వరలో వీడీ 14 చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియ‌జేయ‌నున్నారు. మ‌రోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. గౌత‌మ్ తిన్న‌నూరితో పాటు తాజాగా దిల్ రాజు నిర్మాణంలో మ‌రో మూవీ ఉంది.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి