)
Venkatesh Joins Chiranjeevi mana shankara Vara prasad garu movie shooting: ఒకప్పుడు తెలుగులో అగ్రహీరోలు మల్టీస్టారర్ చిత్రాలు చేసేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఆ తర్వాత కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి హీరోలు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. అంతేకాదు ఎన్టీఆర్, అక్కినేనిలు తమ తర్వాత తరం హీరోలతో మల్టీస్టారర్ చిత్రాలు చేశారు. కానీ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తరంలో వీళ్లెవరు ఒకరితో ఒకరు మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు. మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగినా అవి కార్యరూపం దాల్చలేదు. ఇక వెంకటేష్, నాగార్జున, చిరు, బాలయ్య వంటి హీరోలు తమ ముందు తరం హీరోలు.. తర్వాత తరం హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేశారు. కానీ వీళ్లు ఒకే సినిమాలో ముఖ్యపాత్రల్లో నటించలేదు. ఇపుడిపుడే అది కార్యరూపం దాలుస్తోంది. తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాలో వెంకటేష్ అదిరిపోయే అతిథి పాత్రలో నటిస్తున్నట్టు ఆ మధ్య వెంకటేష్ చెప్పారు. తాజాగా ‘మన శంకర వర ప్రసాద్’ చిత్రంలో వెంకటేష్ యాక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నట్టు చిత్ర యూనిట్ అఫిషియల్ గా ప్రకటించింది.
There are moments in every filmmaker’s life that feel truly magical… and this is one of those moments for me ?
Bringing two most celebrated stars of Telugu Cinema, Megastar @Kchirutweets Garu and Victory @VenkyMama Garu, together on screen is an honour I will cherish forever… pic.twitter.com/Mte6gxR02O
— Anil Ravipudi (@AnilRavipudi) October 23, 2025
దీంతో తెరపై ‘మన శంకర వర ప్రసాద్’తో వెంకీ మామ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలిసారి వీళ్లిద్దరు కలిసి పూర్తి స్థాయిలో కలిసి నటిస్తుండంతో ఈ చిత్రంపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అనిల్ రావిపూడి వెంకటేష్ పాత్రను ఎలా చూపించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. వెంకీ రాకతో ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా టైటిల్ కూడా చిరంజీవి ఒరిజినల్ నేమ్ ‘మన శంకర్ వర ప్రసాద్ గారు’ వచ్చేలా టైటిల్ పెట్టడంతో మెగాభిమానుల ఆనందానికి అవధులు లేవు. తెలుగులో రాజమౌళి తర్వాత అపజయం ఎగరని దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి.
ఇప్పటికే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మూవీ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ తో పాటు మీసాల పిల్ల పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మీసాల పిల్ల సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. చాలా యేళ్ల తర్వాత తెలుగులో ఉదిత్ నారాయణ్ రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.ఈ సినిమాలో ‘రౌడీ అల్లుడు’ సినిమాలోని ‘లవ్లీ మై హీరో’ రీమిక్స్ చేసినట్టు తెలుస్తోంది. తన పాటను తానే రీమిక్స్ చేస్తూ చిరంజీవి మరో సంచలనానికి తెర లేపారనే చెప్పాలి.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ పండగకి వస్తున్నారు అనే ట్యాగ్ లైన్ మంచి ఆప్ట్ గా ఉంది. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు మాచారం. మొత్తంగా మెగాస్టార్ ఇమేజ్ కు తగ్గట్టు అనిల్ రావిపూడి ఈ సినిమాను తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. ఈ మూవీలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ నటిస్తోంది. సైరా నరసింహా రెడ్డి తర్వాత ఈ చిత్రంలో చిరంజీవి, నయనతార జోడిగా యాక్ట్ చేసింది. గాడ్ ఫాదర్ లో చిరంజీవి చెల్లెలు పాత్రలో నటించింది. మరోవైపు చిరంజీవి.. శ్రీకాంత్ ఓదెల, బాబీ, మారుతి, హరీష్ శంకర్ సినిమాలు లైన్ లో ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.