Venkatesh About Rajinikanth: కామెడీ ఆడియన్స్.. సూపర్ స్టార్ ఎవరు అంటే వెంటనే గుర్తొచ్చే పేరు వెంకటేష్. తెలుగులో ఎన్నో కామెడీ సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగారు. ఆరుపదుల వయసు దగ్గర పడుతున్న కానీ.. ఇంకా కూడా ఎంతో ఆక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్య వెంకటేష్ నుంచి వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ విజయ సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ హీరో తన సక్సెస్ కి కారణం మరోసారి సూపర్ స్టార్ అన్నట్లు.. చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
సినీ పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇచ్చిన సలహానే తన విజయానికి మూలకారణమని వెంకటేశ్ వెల్లడించారు.
తొలి దశలో రజనీతో ఏర్పడిన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన ఓ సారి చెప్పిన మాటలు తనను ఎంతో ప్రభావితం చేశాయని వెంకటేశ్ చెప్పారు. “పోస్టర్లు, కటౌట్లు కాదు... మంచి కథలు, మంచి సినిమాలే నీ స్థిర స్థానం కట్టిపడతాయి” అని రజనీ ఇచ్చిన సూచన తనకు మార్గదర్శకంగా మారిందన్నారు.
అప్పటి నుంచి తను ప్రచారానికి.. పోస్టర్స్ పై గ్లామర్ కి.. దూరంగా ఉండి, కంటెంట్‌పై దృష్టి పెట్టడం అలవాటు చేసుకున్నానని..తద్వారా తన స్థాయిని నిలుపుకోవచ్చని నమ్మకం ఏర్పడిందని తెలిపారు. సినిమా విజయం కంటే, ప్రేక్షక హృదయాల్లో నిలిచే కంటెంట్ కలిగిన చిత్రాలు చేయాలనే అభిప్రాయాన్ని ఆయన మరోసారి చెప్పుకొచ్చాడు.
తాను ఆధ్యాత్మికతపై అధిక విశ్వాసం ఉంచుతాననీ, ఈ విషయంలో రజనీకాంత్‌తో ఎంతో అనుబంధం.. ఉందని కూడా చెప్పారు. వ్యక్తిత్వ పరంగా రజనీ నుంచి వచ్చిన ఈ ప్రేరణను జీవితాంతం గుర్తుంచుకుంటానని వెంకటేశ్ అన్నారు.
Also Read: Group 1 Posts: తెలంగాణ గ్రూప్-1 పోస్టుల భర్తీపై బిగ్ ట్విస్ట్.. రంగంలోకి కేంద్ర మంత్రి బండి సంజయ్
Also Read: Diesel Subsidy: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్.. డీజిల్ ధరపై రూ.9 తగ్గింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









