Adarsha Kutumbam: వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ టైటిల్ ఫిక్స్.. నేడే షూటింగ్ ప్రారంభం..

Adarsha Kutumbam House No 47 - AK 4: వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ నేడు అధికారికంగా ప్రారంభమైంది. తాజాగా ఈ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ - AK 47’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. 

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 10, 2025, 11:48 AM IST
Adarsha Kutumbam: వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రానికి ‘ఆదర్శ కుటుంబం’ టైటిల్ ఫిక్స్.. నేడే షూటింగ్ ప్రారంభం..

తెలుగులో గత కొన్నేళ్లుగా పూర్తి స్థాయి ఫ్యామిలీ సినిమాలు వచ్చి చాలా కాలమే అయింది. ఈ నేపథ్యంలో ఎలాంటి కథనైనా తెరకెక్కంచి మెప్పించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్.. వెంకటేష్ వంటి క్లాస్ అండ్ మాస్ హీరోతో కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసినప్పటి నుంచే వీళ్ల కలయికలో ఎలాంటి చిత్రం రాబోతుందా అని ఆసక్తిగా ఎదురు చూసారు. తాజాగా అభిమానుల అంచనాలకు తగ్గట్టే.. వెంకటేష్ కు ఫ్యామిలీస్ లో ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 ’ అనే టైటిల్ పిక్స్ చేసారు. 

Add Zee News as a Preferred Source

ఈ టైటిల్ ను బట్టే ఈ సినిమా పూర్తిగ కుటుంబ నేపథ్యంలో తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. కుటుంబం కోసం కష్టపడే మిడిల్ క్లాస్ అంకుల్ పాత్రలో వెంకీ మామ కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ రోజు నుంచి కంటిన్యూగా మూడు షెడ్యూల్స్ లో కంప్లీట్ చేసి వచ్చే యేడాది వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో వెంకీ మామ సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. వెంకటేష్ సినీ ప్రయాణంలో 77వ సినిమాగా రాబోతుంది. 

గతంలో త్రివిక్రమ్ కథ, మాటలు అందించిన ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మధ్యలో ‘వాసు’ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించారు.  ఇపుడు అదే రచయత దర్శకత్వంలో మొదటిసారి  చేస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటి వరకు యంగ్ టాప్ హీరోలతో సినిమాలు తెరకెక్కించిన త్రివిక్రమ్..ఇపుడు సీనియర్ స్టార్ హీరోతో సినిమా చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం టాప్ లీగ్ లో ఉన్న డైరెక్టర్స్ అందరు కూడా సీనియర్ హీరోలతో సినిమాలు చేయడం లేదు. యంగ్ స్టార్స్ తోనే సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అందులో బోయపాటి శ్రీను మినహాయింపు అని చెప్పాలి.  

Read more:  Chiranjeevi: పాయే.. మరోసారి చిరంజీవి పరువు పాయే..

Read more:  నాగార్జున ‘శివ’ 4K రీ రిలీజ్ టోటల్ కలెక్షన్స్.. సీనియర్ హీరోల్లో నాగార్జున సరికొత్త రికార్డు.. 

మరి సీనియర్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ వెండితెరపై ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి. వెంకటేష్ ఈ ఇయర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సీనియర్ తెలుగు టాప్ హీరోల్లో తొలి రూ. 300 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన కథానాయకుడిగా రికార్డులకు ఎక్కారు. మొత్తంగా త్రివిక్రమ్ కూడా తొలిసారి రూట్ ఛేంజ్ చేసి సీనియర్ స్టార్ హీరోతో మూవీ  చేస్తుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఈ సినిమాతో వెంకటేష్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి మాయ చేయడం గ్యారంటీ అని ఆయన ఫ్యాన్స్ చెబుతున్న మాట. 

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News