రివ్యూ: 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో(14 Days Girl Friend Intlo)
నటీనటులు : అంకిత్ కొయ్య, వెన్నెల కిషోర్, శ్రియ కొంతం,ఇంద్రజ,ప్రశాంత్ శర్మ తదితరులు
సంగీతం : మార్క్ కే రాబిన్
సినిమాటోగ్రఫీ : కే సోమ శేఖర్
ఎడిటర్ : ప్రదీప్ రాయ్
బ్యానర్ : త్య ఆర్ట్స్ ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : సత్య కోమల్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : శ్రీ హర్ష మన్నె
సత్య ఆర్ట్స్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సత్య కోమల్ నిర్మించిన ‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’ చిత్రాన్ని శ్రీ హర్ష మన్నె డైరెక్ట్ చేసారు. #90s వెబ్ సిరీస్ తెరకెక్కించిన ఎంఎన్ఓపీ అధినేత రాజశేఖర్ మేడారం సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అంకిత్ కొయ్య కథానాయకుడిగా నటించారు. ఇప్పటికే ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
హర్ష(అంకిత్ కొయ్య) సినిమా డైరెక్టర్ అనుకుంటాడు. డేటింగ్ ఆప్ లో ఆహాన(శ్రియ కొంతం) ప్రొఫైల్ చూసి తనతో ప్రేమ పంచుకుంటాడు. ఆహాన పేరెంట్స్ ఒక పెళ్లికి వెళ్లడంతో హర్షను ఇంటికి రమ్మంటుంది. అలా గర్ల్ ఫ్రెండ్ ను కలవడానికి వెళ్లిన హర్ష ఆ ఇంట్లో 14 రోజులు ఉండాల్సి వస్తుంది. ఆహాన తల్లిదండ్రులకు, తాతాకు తెలియకుండా ఆ ఇంట్లో గడపాల్సి వస్తోంది. హర్షను దాచిపెట్టడంలో ఆహాన ఎలాంటి కష్టాలు పడింది? మ్యారేజ్ కు వెళ్లిన పేరేంట్స్ ఎందుకు తిరిగి వచ్చారు? ఇది మాత్రమే కాకుండా ఆహానకు వచ్చిన మరో సమస్య ఏమిటీ..? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
ఫిల్మ్ మేకర్ కావాలనుకునే కుర్రాడు తన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఇరుక్కుపోతే ఏమిటీ పరిస్థితి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమానే ‘14 డేస్ డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’. చిన్న సింగిల్ పాయింట్ ను ఎంతో ఎంగేజింగ్ గా తెరకెక్కించాడు. ఈ మధ్య చాలా మంది డేటింగ్ అప్ ద్వారా పరిచయం ఏర్పడటం వలన ఇప్పటి యూత్ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తున్నారనే దానికి హర్ష, ఆహాన పాత్రలే ఉదాహరణగా చూపించాడు. ఇంట్లో వాళ్లు ఊరికి వెళ్లడంతో తన బాయ్ ఫ్రెండ్ ను ఇంటికి రమ్మని చెప్పడం.. అదే సమయంలో అనుకోకుండా పేరుంట్స్ ఇంట్లోకి రావడం అనే కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా మలచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. స్టోరీలో అసలు పాయింట్ హీరో ఇంట్లో లాక్ అయిపోవడం.. అక్కడి నుంచి కథలు రొమాంటిక్ థ్రిల్లర్ గా టర్న్ తీసుకోవడం. హీరో హీరోయిన్ పేరెంట్స్ 0దొరికిపోతాడేమో అన్న టెన్షన్ ని ఆడియన్స్ లో క్రియేట్ చేయడంలో దర్శకుడు ఎంతో హిల్లేరియస్ గా చూపించాడు.
సినిమాలో 14 రోజులు హీరో ఆహాన ఇంట్లో కష్టాలను ఫేస్ చేయాల్సి రావడం వంటివి ఎంటర్టైన్మెంట్ గా సాగడం వంటివి చాలా బాగున్నాయి. పిల్లలకు పెద్దలు ఇచ్చే స్వేచ్ఛను దుర్వినియోగం ఎలా చేస్తారనే అనే పాయింట్ చక్కగా తెరపై చూపించాడు. ఈ నాటి యూత్ బిహేవియర్ ను చూపిండు. ఈ సినిమా మొత్తం ఒక ఇంట్లో జరగడం ఇంట్రెస్టింగ్. అందులో హిల్లేరియస్ కామెడీని పండించడం బాగుంది. దీని వలన స్టోరీ మరో సంఘర్షణ మొదలవుతుంది. ఆ సంఘర్షణకు సమాధానమే ఈ మూవీ క్లైమాక్స్ . ఆ పాయింట్ ను కూడా చాలా సెన్సిబుల్ గా హ్యాండిల్ చేశాడు దర్శకుడు.
శ్రీ హర్ష మన్నే స్టోరీని నడిపించిన విధానం బాగుంది. ఒకే చోట కథ సాగుతున్న ఎక్కడా బోరింగ్ లేకుండా కథను నడిపించిన విధానం బాగుంది. కామెడీ పాటు ఎమోషన్స్ కూడా బాగా హ్యాండిల్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కే రాబిన్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ బాగుంది. ప్రదీప్ రాయ్ పనితనం మెప్పించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటులు విషయానికొస్తే..
అంకిత్ కొయ్య చాలా సెటిల్డ్ గా యాక్ట్ చేశాడు. మొత్తంగా గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఎరక్కపోయి ఇరుక్కువడం వంటివి ఆకట్టుకుంటాయి. శ్రియ కొంతం యాక్టింగ్ బాగుంది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగున్నాయి. వెన్నెల కిషోర్ ఉన్నంతో కడుపుబ్బా నవ్వించాడు. ఈయన కనిపించే ప్రతి సీన్ లో కనిపించిన నవ్వులు పూజించారు. సినిమా మొత్తంలో వెన్నెల కిషోర్ మెయిన్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇంద్రజ పాత్ర కొంతే ఉన్నా పర్వాలేదు అనిపించింది. మిగతా నటీనటులంతా తమ పరిధిలో బాగానే నటించారు.
పంచ్ లైన్.. హాయిగా నవ్వుకునే ‘14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’..
రేటింగ్: 2.75/5
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









