Allu fans fires on venu swamy: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప2 మూవీ ఇటీవల ఎన్నో రికార్డులను బ్రేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా కేవలం ఆరురోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిపోయింది. మరోవైపు ఈ మూవీకి చెందిన అనేక అంశాలు వివాదాలుగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా విడుదల సమయంలో సంథ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అదే విధంగా.. దీనిలో రేవతి అనే మహిళ చనిపోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికే సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది.
దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులను నమోదు చేశారు. అదే విధంగా అల్లు అర్జున్ పై కూడా కేసును నమోదు చేశారు. తాజాగా.. నిన్న (గురువారం) ఆయనను అరెస్ట్ చేయడం, కోర్టులో హజరు పర్చడం, రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. కేవలం ఒక్కరోజులోనే అనేక నాటకీయ పరిణామాలుచోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ ను పోలీసులు విడుదల చేశారు.
అదే విధంగా.. దీనిపై పెద్ద ఎత్తున దుమారం ప్రస్తుతం నడుస్తొంది. అయితే.. ఇటీవల అల్లు అర్జున్ సినిమా పుష్ప2 మూవీ సినిమా చూశాక.. వివాదస్పద ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఒక వీడియో రిలీజ్ చేశారు. దీనిలో అల్లుఅర్జున్ ఈ సినిమాలో జాతర సీన్ అదరగొట్టారని, చీర కట్టుకుని తెగ హల్ చల్ చేశారన్నారు. ఆయనకు మరో 15 ఏళ్ల పాటు రాజయోగం ఉందని, ఆయనతో సినిమా తీసిన నిర్మాతలు డబ్బుల బుట్టలో పడినట్లు అని వీడియో రిలీజ్ చేశారు.
తాజాగా కొంత మంది అల్లు అర్జున్ అభిమానులు.. మాత్రం వేణు స్వామిని ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది. ఏ మూహుర్తానికి తమ ఐకాన్ స్టార్ మీద అన్నావో.. ఆయన జైలు పాలయ్యాడని అంటున్నారంట. దయచేసి నువ్వు.. జాతకాలు చెప్పొద్దని కూడా కొందరు సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారంట. అయితే.. వేణు స్వామి మాత్రమే కాకుండా.. ఆయన సతీమణి శ్రీవీణసైతం.. పుష్ప2 సినిమా చూసి.. అల్లు అర్జున్ దిష్టితీయించుకొవాలని పోస్టు కూడా పెట్టారు.