Venu swamy controversy prediction: వేణు స్వామి ఇటీవల తరచుగా వివాదాలను రాజేస్తున్నారు. ఇప్పటికే ఆయన హీరో ప్రభాస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతారని, సమంతా, విజయ్ దేవర కొండ ఇద్దరు సూసైడ్ చేసుకుంటారని చెప్పిన ఆడియో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో మరోసారి వేణుస్వామి రచ్చ స్టార్ట్ చేశారు. దీనిపై ఆయా హీరో అభిమానులు మండిపడుతున్నారు. వేణు స్వామి దొరికితే చితక్కొట్టుడే అంటూ కౌంటర్ లు వేస్తున్నారు.
గతంలో శోభిత, చైతుల పెళ్లిపై ఇలాంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి ఏకంగా మహిళ కమిషన్ తో కూడా చివాట్లు తిన్నారు. బహిరంగంగా మళ్లీ వివాదస్పద జాతకాలు చెప్పనని సారీ కూడా చెప్పారు. అయిన కూడా అదేదో.. కొంత మంది మరీ బుద్ది మారాదా.. ఏంటో కానీ... మరల ఆయన కాంట్ర వర్సీగా మాట్లాడారు. ఈ సారి కోలివుడ్ లోప్రస్తుతం విజయ్ తళపతి పుల్ స్వింగ్ లో ఉన్నారు. పార్టీ పెట్టి తనదైన స్టైల్ లో రాణించడానికి ప్రయత్నిస్తున్నారు.
అయితే.. మరోవైపు త్రిష కూడా రాజకీయాల్లో ఎల్లప్పుడు వార్తలలో ఉంటున్నారు. గతంలో చాన్స్ వస్తే.. సీఎంగా కూడా చేస్తానని కూడా తన మనసులో మాటను బైటపెట్టారు.ఈ క్రమంలో వేణు స్వామి తాజాగా.. విజయ్ తళపతి తన భార్యకు డైవర్స్ ఇచ్చేసి.. త్రిషను పెళ్లి చేసుకుంటారని కామెంట్స్ చేశారు. కొన్నిరోజులుగా ఇద్దరు కూడా డేటింగ్ లో ఉన్నారని.. మరికొన్నిరోజుల్లో పెళ్లి చేసుకొవడం పక్కా.. అంటూ వేణు స్వామి సంచలన జ్యోతిష్యం చెప్పారు.
ప్రస్తుతం వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఫెమస్ అయ్యేందుకు ఏదీ పడితే.. అది మాట్లాడకూడదని కొంత మంది చివాట్లు పెడుతున్నారు. మొత్తంగా విజయ్ తళపతి, త్రిష అంశం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter