)
Dharmendra Hospitalised: ధర్మేంద్ర బాలీవుడ్ తొలి తరం యాక్షన్ హీరోగా తన కంటూ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాదు బాలీవుడ్ లో సస్పెన్స్, క్రైం, జేమ్స్ బాండ్.. తరహా చిత్రాలకు ధర్మేంద్ర కేరాఫ్ అడ్రస్. తొలితరం బాలీవుడ్ కండలవీరుడు. అభిమానుల చేత బాలీవుడ్ హీమ్యాన్ గా కీర్తింపబడిన నట దిగ్గజంగా పేరు గడించారు. తాజాగా ఈయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే సాధారణ చెకప్ లో భాగంగా ఆయన హాస్పిటల్ కు వెళ్లినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం కుదటగానే ఉందని చెబుతున్నారు.
ధర్మేంద్ర విషయానికొస్తే.. అభిమానులకు ఆయన యాక్షన్ కింగ్..సూపర్ హిట్ చిత్రాల భారతీయ హీ మ్యాన్...అమ్మాయిల కలల రాకుమారుడు. డాన్స్ చేసినా, పైట్ చేసినా, డైలాగ్ చెప్పినా ప్రేక్షకుల చేత ఈలలు వేయించిన తొలితరం అసలు సిసలు ఊర మాస్ హీరో. పంజాబ్ లో పుట్టి బాలీవుడ్ సినిమాల్లో తనదైన ముద్ర వేసారు. బాలీవుడ్ అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు..అదీ హీరోగా ప్రూవ్ చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు...అలాంటిది అవకాశం అందిపుచ్చుకోవడమే కాదు..తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో ధర్మేంద్ర. తన నటనతో అశేష ప్రేక్షకులను అలరించి, ఎంతో మంది ఫ్యాన్స్ ను అభిమానులను సంపాదించుకున్నారు.పంజాబ్ రాష్టం లుధియానా జిల్లాలో నస్రలీ అనే గ్రామంలో 1935 డిసెంబర్ 8 జన్మించారు తండ్రి కేవల్ కిషన్ సింగ్ డియోల్,తల్లి సత్వంత్ కౌర్ . పూర్తి పేరు ధరమ్ సింగ్ డియోల్. అప్పట్లో ఓ ఫిలింఫేర్ పత్రిక నిర్వహించిన న్యూ టాలెంట్ పురస్కారానికి ఎంపికయ్యడు ధర్మేంద్ర. దీంతో సినిమాల్లో ట్రై చేయాలని పంజాబ్ నుండి ముంబాయ్ కి వచ్చి ఛాన్సుల కోసం ప్రయత్నించాడు. ధర్మేంద్ర మొదటి సినిమా ‘దిల్ భీ తేరా హమ్ భీ తేరా’ .
1960-67 మధ్య ఆయన నటించిన సినిమాలతో అమ్మాయిలకు కళల రాకుమారుడయ్యాడు.. సూరత్ ఔర్ సీరత్, బాందినీ, దిల్ నే ఫిర్ యాద్ కియా, దుల్హన్ ఏక్ రాత్ కీ, పూజా కే ఫూల్ లాంటి సినిమాలలో రెండో హీరో గా,సహాయ నటుడిగా చేసాడు. 1966లో వచ్చిన ‘ఫూల్ ఔర్ పత్తర్’ సినిమాతో పూర్తి స్తాయి హీరోగా మారాడు ధర్మేంద్ర . ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి వసూల్లా వర్షం కురిపించింది.ధర్మంద్ర ఉత్తమ నటుడుగా పీల్మ్ ఫేర్ అవార్డ్ కు నామినేట్ అయ్యారు.
తుమ్ హసీన్ మే జవాన్, దో చోర్, చుప్కే చుప్కే, దిల్లగీ, నౌకర్ బీవీ కా లాంటి కామెడి ప్రదాన చిత్రాలలో నటించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడ పొందాడు... కామెడీతో పాటు యాక్షన్, రొమాంటిక్ పాత్రలు కూడా చేస్తు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. డిఫరేంట్ పాత్రలు చేస్తూ వైవిధ్యమైన హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
1976 -84 మద్య కాలంలో ధర్మేంద్ర యక్షన్ హీరోగా చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. ధరమ్ వీర్, చరస్, ఆజాద్, గజబ్, రాజ్ పుత్, భగావత్, జానీ దోస్త్, ధరమ్ ఔర్ కానూన్, మై ఇంతెకం లూంగా, జానే నహీ దూంగా, హుకుమత్, రాజ్ తిలక్ లాంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యి ధర్మంద్రకు యాక్షన్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చాయి.ఎన్నో చెప్పుకోదగ్గ సినిమాలు ఉన్నా షోలే సినిమాకున్నా ప్రత్యేకతే వేరు .1975లో వచ్చిన ఈ మూవీ భారతీయ తెరపై ఓ సంచలనం. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల టికెట్లు తెగాయి. ఇది అప్పటికీ ఎప్పటికీ ఓ రికార్డు. ఎన్నో రికార్డులను,రివార్డులను సొంతం చేసుకుంది ఈ చిత్రం.. ఇండియా టైమ్స్ నిర్వహించిన సర్వే లో 25 తప్పక చూడాల్సిన బాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా ఎంపికయ్యింది. అమితాబ్ బచ్చన్ ,దర్మంద్ర ప్రాణ మిత్రులగా నటించిన ఈ మూవీలో వీరూ గా ఎక్షట్రడనరి నటనతో అకట్టుకున్నారు ధర్మంద్ర.
దర్మంద్రతో జోడి కట్టిన హీరోయిన్స్ లలో హిట్ ఫేర్ గా పేరు తెచ్చుకున్నా హీరోయిన్ హేమామాలిని,,వీళ్ళిద్దరు కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. రాజా జానీ, సీతా ఔర్ గీతా, షరాఫత్, నయా జమానా, పత్తర్ ఔర్ పాయల్ లాంటి చిత్రాలు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్స్. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా వీళ్లిద్దరూ పెయిర్ అయ్యారు. త్వరలో 90వ పడిలో పడిన ఈయన త్వరలో ‘ఇక్కీస్’ సినిమాతో పలకరించబోతున్నారు. దర్మంద్ర హీరోగా రాణించడమే కాదు ధర్మేంద్ర పిల్లలు సన్నిడియేల్, బాబీ డియేల్ లూ బాలీవుడ్ లో తమకంటు స్థానం సంపాదించుకున్నారు.. కొన్ని సినిమాల్లో దర్మంద్ర, సన్ని, బాబీ డియేల్ లు కలిసి ఒకే స్ర్కీన్ పై కనిపించి ప్రేక్షకులకు, అభిమానులను కన్నుల పండగ చేసారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.