Manoj Kumar Death: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మనోజ్ కుమార్ మృతి..

Manoj Kumar Death: సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. బాలీవుడ్ తొలి తరం నటుల్లో దేశ భక్తి చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మనోజ్ కుమార్. ఈ రోజు ఉదయం ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 4, 2025, 07:56 AM IST
Manoj Kumar Death: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో మనోజ్ కుమార్ మృతి..

Manoj Kumar Death:బాలీవుడ్ తొలి తరంలో రాజ్ కపూర్, దిలీప్ కుమార్, దేవానంద వంటి హీరోలు రాజ్యమేలుతున్న టైమ్ లో హీరోగా ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా దేశ భక్తి నేపథ్యంలో ఆయన చేసినన్ని చిత్రాలు బహుశా భారత దేశంలో మరే నటుడు చేయలేదని చెప్పాలి. కేవలం నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా బాలీవుడ్ చిత్రసీమపై చెరగని ముద్రవేశారు. ముఖ్యంగా ఈయన నటించిన ప్రతి సినిమాలో భరత్ కుమార్ పేరుతోనే ఎక్కువ స్క్రీన్ పై కనిపించారు. 1957లో సహరా సినిమాతో పరిచయమైన ఈయన నట ప్రస్థానం తుది వరకు సాగింది.

Add Zee News as a Preferred Source

ముఖ్యంగా షహీద్, ఉపకార్, నీల్ కమల్, సాజన్, పంజాయిత్, రోటీ కపడా ఔర్ మఖాన్, క్రాంతి వంటి చిత్రాలు మనోజ్ కుమార్ కు ఎనలేని పేరు తీసుకొచ్చాయి. ఆయా సినిమాలు తెలుగు ఇతర భాషల్లో రీమేకై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కృష్ణ చేసిన పాడిపంటలు, ఎన్టీఆర్ చేసిన ఒకే కుటుంబం, శోభన్ బాబు నటించిన జీవన పోరాటం వంటి చిత్రాలు మనోజ్ కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలకు రీమేక్  కావడం విశేషం.

ఈయన చిత్ర సీమకు చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 1992లో పద్మశ్రీతో గౌరవించింది. అటు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్.. 2015లో ఈయన్ని చిత్రసీమలో అత్యున్నత జీవిత సాఫల్య పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. ఈయన 24 జూలై 1937లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రస్తుత పాకిస్థాన్ లోని ఖైబర్ పంఖ్తుఖ్వాలోని అబోటాబాద్ లో జన్మించారు. దేశ విభజన తర్వాత ఈయన కుటుంబం భారత దేశానికి వలస వచ్చారు. ఈయన అసలు పేరు హరికిషన్ గోస్వామి. తెర పేరు మనోజ్ కుమార్. కానీ సినిమాల్లో భరత్ కుమార్ గా ఎక్కువ పాపులర్ అయ్యారు.

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News