Vidya Balan on Casting Coush: క్యాస్టింగ్ కౌచ్ ప్రస్తుతం సినిమా పరిశ్రమను వేధిస్తున్న సమస్య. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ తో పాటు చాలా మంది గతంలో సినీ కెరీర్ మొదట్లో తమకు జరిగిన అనుభవాలను గురించి బహిరంగంగ మాట్లాడుతున్నారు. తాజాగా విద్యాబాలన్ కూడా కాస్టింగ్ కౌచ్ పై తన అనుభవాన్ని వెల్లడించింది.ఇండస్ట్రీలో చాలా మంది కథానాయికలు కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. నటీమణులు కూడా ధైర్యంగా బయటకు వచ్చి తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. చాలా మంది నటీమణులు సినిమా పరిశ్రమలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడుతున్నారు. యువ హీరోయిన్ల నుండి సీనియర్ కథానాయికల వరకు, ఇది వరకు వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నారు.
రీసెంట్ గా విద్యాబాలన్ కూడా తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. ఒక నిర్మాత నుంచి తనకు ఎదురైన అవమానం కారణంగా తాను 6 నెలలు నరకం అనుభవించాల్సి వచ్చిందన్నారు. సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో విద్యాబాలన్ ఒకరు. ఈమె హిందీకే కాకుండా కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించి మెప్పించింది. విద్యాబాలన్ నటించిన ‘డర్టీ పిక్చర్’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీసిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని నటనకు జాతీయ అవార్డు కైవసం చేసుకుంది. అంతేకాదు ఏకంగా పద్మశ్రీ అవార్డు సైతం దక్కించుకుంది.
‘డర్టీ పిక్చర్’ తర్వాత, విద్యాబాలన్ బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్ జీవిత చరిత్రతో తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలో బసవ తారకం పాత్రలో ఒదిగిపోయింది. ఈ సినిమా పెద్దగా అలరించలేకపోయింది.
తాజాగా విద్యాబాలన్ చిత్ర పరిశ్రమను దిమ్మ దిరిగేలా ఒక కామెంట్ చేసింది. ఒక నిర్మాత తనను అవమానించాడని విద్యాబాలన్ అన్నారు. ఇటీవలే విద్యా ఒక నిర్మాత తన దగ్గరికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని ప్రస్తావించింది. అతను నా దగ్గరకు వచ్చి నన్ను అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడిన విషయాన్ని బయట పెట్టింది. ఆ మాటలు నన్ను చాలా బాధించాయి. ఆ అవమానం వల్ల, నేను దాదాపు ఆరు నెలల పాటు అద్దంలో నా ముఖం నేను చూసుకోలేపోయానంది.
ఆ మాటలు నన్ను ఎంతగా బాధించాయంటే నేను ఆరు నెలలు నరకం అనుభవించాను. ఆ మాటలు విన్న తర్వాత, నేను మునుపటిలా సాధారణ వ్యక్తిగా ఉండలేకపోయాను. నా కెరీర్‌లో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. "అదే సమయంలో, నేను బాడీ షేమ్ కి గురైన విషయాన్ని విద్యాబాలన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నాకు కెరీర్ మొదట్లో నా మాతృభాష మలయాళంలో కూడా ఆఫర్ వచ్చింది. కానీ అనుకోని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. కాబట్టి అందరూ నన్ను దురదృష్టవంతురాలన్నారు. ఏదో కారణం చేత సినిమా ఆగిపోయినందుకు వాళ్ళు నన్ను నిందించారు. నా కెరీర్‌లో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి అని విద్యాబాలన్ అన్నారు.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









