)
Vijay Antony Maargan Movie: విజయ్ ఆంటోని మరో మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన మార్గన్ మూవీలో విజయ్ నటిస్తూ.. నిర్మించాడు. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. రేపు (జూన్ 27) తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ పేరుతో మూవీ టీమ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ .. విజయ్ ఆంటోనిని తాను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నానని.. ఆయనకు సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉందన్నారు. అందుకే తాను ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు.
విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. సురేష్ బాబు చాలా గొప్ప నిర్మాత అని.. భవిష్యత్‌లో ఆయనతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. లియో జాన్ పాల్ ఈ సినిమాను అద్భుతంగా తీశారని అన్నారు. ఇది నార్మల్ క్రైమ్ థ్రిల్లర్ కాదని.. చాలా లేయర్లు ఉన్నాయన్నారు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకు చాలా ఎంగేజింగ్‌గా ఉంటుందన్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని అన్నారు. తాను ఈ సినిమాకు సంగీతాన్ని అందించానని.. భద్రకాళి, లాయర్ సినిమాలకు కూడా మ్యూజిక్ అందిస్తున్నట్లు చెప్పారు. మార్గన్ సినిమాను చూసి అందరూ ఆదరించాలని కోరారు.
మార్గన్ మూవీ రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్‌లా ఉండదని.. ప్రేక్షకులకు ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందన్నారు అజయ్ ధీషన్. డైరెక్టర్ లియో జాన్ పాల్ తన మీద ఎంతో నమ్మకంతో అవకాశం ఇచ్చారని చెప్పారు. బ్రిగిడ మాట్లాడుతూ.. మార్గన్ మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని.. ఈ సినిమా కూడా సపోర్ట్ చేయాలని కోరారు. దీప్శిఖ మాట్లాడుతూ .. ఈ మూవీలో తన పాత్ర అందరికీ నచ్చుతుందని భావిస్తున్నానని అన్నారు. ఈ మూవీ టీమ్‌తో పని చేయడం వల్ల ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.
టెక్నికల్ టీమ్:
==> రైటర్, డైరెక్టర్: లియో జాన్ పాల్
==> ప్రొడ్యూసర్: విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పొరేషన్
==> ప్రెజెంట్స్: సర్వాంత్ రామ్ క్రియేషన్స్, జె.రామాంజనేయులు
==> మ్యూజిక్: విజయ్ ఆంటోని
==> సినిమాటోగ్రఫీ: యువ ఎస్
==> ఆర్ట్ డైరెక్టర్: రాజా ఎ
==> PRO: సాయి సతీష్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.