Bhadrakaali Teaser: విజయ్ ఆంటోని కోలీవుడ్ లో సంగీత దర్శకుడిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత హీరోగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కెరీర్ లో ప్రతిష్ఠాత్మక 25వ చిత్రం ‘భద్రకాళి’. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన టీజర్ కు కూడా ఆకట్టుకుంటోంది.
అరుణ్ ప్రభు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని సమర్పణలో తెరకెక్కుతోంది.
??️ TESAER OUT NOW ??️
?#Bhadrakaali - https://t.co/FGVW4S2xTZ#VA25⛓️@vijayantony @ArunPrabu_ @TruptiRavi58094 #SunilKirpalani @vijayantonyfilm pic.twitter.com/6dz4gkeBG9
— BA Raju's Team (@baraju_SuperHit) March 12, 2025
భద్రకాళి సినిమా టీజర్ విషయానికొస్తే.. ‘పిల్లి కూడా ఒక రోజు పులి అవును.. అబద్దం, అహంకారం అంతం అవును’.. అంటూ ప్రారంభమైన ఈ టీజర్‌లో విజయ్ ఆంటోని అసలు ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడో ఆడియన్స్ కన్ఫ్యూజన్ చేస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. టీజర్ లో ఒకసారి ఫ్యామిలీ మెన్‌లా.. మరోసారి గ్యాంగ్ స్టర్‌లా.. మరో సీన్ లో ఉన్నతాధికారిలా కనిపిస్తున్నారు.. అసలు ఈ కిట్టు ఎవరు? అనే ఆసక్తిని రేకెత్తించేలా భద్రకాళి టీజర్ ఉంది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
రూ. 190 కోట్ల కుంభకోణం చుట్టూ ఈ సినిమా స్టోరీని అల్లాడు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ చివర్లో వచ్చిన డైలాగ్‌తో టీజర్ మీద మరింత ఆసక్తిని పెంచారు. విజయ్ ఆంటోని ఈ చిత్రంలో ఇది వరకు ఎన్నడూ కనిపించినంత స్టైలీష్‌గా, యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ ఆంటోని సంగీతాన్ని కూడా అందించడం విశేషం. సినిమాటోగ్రాఫర్ షెల్లీ కాలిస్ట్ విజువల్స్ ఈ టీజర్‌లో అద్భుతంగా ఉన్నాయి. విజయ్ ఆంటోనీ ఆర్ఆర్, రేమండ్ డెరిక్ క్రాస్టా ఎడిటింగ్, రాజశేఖర్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ టీజర్‌లో హైలెట్ గా నిలిచాయి.
ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి వారు లీడ్ రోల్స్ లో నటించారు. టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ భద్రకాళి సినిమాను సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









