)
Vijay Devarakonda: అక్రమ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో విజయ్ దేవరకొండ ఈ రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు అయ్యారు. ముఖ్యంగా అక్రమ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించితీసుకున్న పారితోషికాలు, కమిషన్స్ గురించి ఆరా తీయనున్నారు. చట్టవిరుద్ధమైన యాప్స్, ఎందుకు ప్రమోషన్ చెయ్యాల్సి వచ్చింది? అలానే మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండతో పాటు నటుడు రాణా ఈనెల 11న, మంచు లక్ష్మికి ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపింది. విజయ్ దేవరకొండను ఈ అక్రమ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించివారు ఎలా అప్రోచ్ అయ్యారనే కోణంలో విచారణ కొనసాగనుంది. విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. రీసెంట్ గా ‘కింగ్ డమ్’ మూవీతో పలకరించారు. ఈ సినిమా తొలి రోజు రికార్డు బ్రేక్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత శుక్ర, శని, ఆదివారాలు ఈ సినిమాకు ఓ మోస్తరు కలెక్షన్స్ ను రాబట్టింది.
ఇక సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. రోజుకు కనీసం రూ. కోటి లోపు షేర్ మాత్రమే అందుకుంటోంది. మొత్తంగా ఈ వీకండ్ వరకు రూ. 10 కోట్ల కు షేర్ రాబట్టాలి. ఇపుడున్న పరిస్థితుల్లో ‘కింగ్ డమ్’ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమే అని చెప్పాలి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ .. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్ధన్ సినిమాతో పాటు రాహుల్ సాంకృత్యాన్ మరో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాలపైనే విజయ్ దేవరకొండ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.