Vijay Deverakonda Favourite Hero: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఇటీవల చెన్నై స్టార్ సూర్య నటించిన తాజా తమిళ సినిమా రెట్రో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో సూర్య, పూజా హెగ్డే తదితర చిత్రబృందం పాల్గొన్నారు.
ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తనకు సూర్య పైన ఉన్న అభిమానం గురించి చెబుతూ.. "సూర్య అన్నా నా ఫేవరేట్ యాక్టర్స్‌లో ఒకరు. ఆయన నటన తరచూ నన్ను ఆశ్చర్యానికి గురి చేసేది. ఆయన సినిమాలు నాకు పెద్ద ఇన్స్పిరేషన్. నేను కూడా ఆయనలా మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సూర్య సొన్నా కృష్ణన్ నా ఫేవరెట్ మూవీ. అందులో 'చంచల' సాంగ్ నాకు చాలా ఇష్టం. రెట్రో పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను." ఇక ఇలా తన ఫేవరెట్ హీరో ఎవరు బయటపెట్టేసారు విజయ్ దేవరకొండ.
ఇక ఇదే ఈవెంట్లో విజయ్ తన ప్రసంగంలో పహల్గామ్ ఉగ్రదాడిపై తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, "ఈ టెర్రరిస్టులు బుద్ధిలేని వారు. వీరికి విద్య అవసరం. పాకిస్తాన్‌కు మౌలిక సదుపాయాలు సరిగా లేవు. తమ దేశపు సమస్యలు కూడా తీర్చుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితిలోనూ భారత్‌పై కాశ్మీర్ కోసం దాడులు చేయాలన్న ధైర్యం చూపిస్తున్నారు. నేను మరోసారి స్పష్టంగా చెబుతున్నాను, కాశ్మీర్ భారత్‌కు చెందినది. కాశ్మీరీలు మన దేశం యొక్క అంతర్భాగం." అని చెప్పుకొచ్చారు హ
అంతేకాకుండా.."మనమంతా మానవత్వంతో ముందు సాగాలి. మిత్రత భావన పెంచుకోవాలి. భారత్‌కు పాక్‌పై యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు అని నేను బలంగా నమ్ముతున్నాను. పాకిస్తాన్ ప్రజలు తమ ప్రభుత్వంపై విరుచుకుపడే రోజు వస్తుంది."
సూర్య, పూజా హెగ్డే నటించిన రెట్రో సినిమాకు కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. 2D ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ సంథోష్ నారాయణన్ సంగీతం అందించారు. మే 1, 2025న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తెలుగు వెర్షన్‌ను నాగ వంశీ విడుదల చేయనున్నారు.
ఇకపోతే విజయ్ దేవరకొండ త్వరలో కింగ్‌డమ్ సినిమాలో కనిపించబోతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో విజయ్ మరోసారి తన టాలెంట్‌ను నిరూపించనున్నారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: AP Bars: మందుబాబుకు జాక్‌పాట్.. భారీగా ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Also Read: Anant Ambani: కొత్త జీవితంలోకి ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook








