Jana Nayagan: ఎన్నికలే టార్గెట్ గా విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్ డేట్.. వర్కౌట్ అయ్యేనా..!

Jana Nayagan Release Date: తమిళ అగ్ర కథానాయకుడు దళపతి విజయ్ ‘జననాయగన్’ అనే సినిమా చేస్తున్నాడు. రాజకీయాల్లో వెళ్లే ముందు చేసే చివరి సినిమా ఆయన అనౌన్స్ చేసారు. ఈ మూవీ తర్వాత ఏసినిమాలు చేయనని చెబుతున్నారు. ఇక తమిళనాడులో వచ్చే యేడాది ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 25, 2025, 12:53 PM IST
Jana Nayagan: ఎన్నికలే టార్గెట్ గా  విజయ్ ‘జన నాయగన్’ రిలీజ్ డేట్.. వర్కౌట్ అయ్యేనా..!

Jana Nayagan Release Date: విజయ్ తన 69వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను తన రాజకీయ ఎదుగుదలకు పనికి వచ్చేలా ఈ స్టోరిని ఎంపిక చేసుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాకు జన నాయకుడు పేరు వచ్చేలా ‘జన నాయగన్’ అనే టైటిల్ తో ఈ సినిమాపై మంచి అంచనాలు పెంచేసారు. ఇప్పటికే విజయ్.. ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో రాజకీయ  పార్టీని స్థాపించాడు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా విజయ్ .. ఈ పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఓటర్లను  ప్రభావితం చేసే ఉద్దేశ్యంతో ‘జన నాయగన్’ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న  విడుదల చేస్తున్నారు. అంతేకాదు తమిళనాడులో ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పొంగళ్ పోటీలో తన సినిమాను రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ డేట్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో విడుదలైన సినిమాలు అన్ని మంచి విజయాలనే సాధించాయి. ఈ సారి కూడా జన నాయకన్ థియేట్రికల్ గా రీల్ లైఫ్ లో  మెప్పించినా.. రియల్  లైఫ్ లో జన నాయకుడు అవుతాడా లేదా అనేది ఓటర్లు నిర్ణయిస్తారు.

Add Zee News as a Preferred Source

ఇక తమిళనాడులో  ఎంజీఆర్ మినహా మరో హీరో ఎవరు ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ తర్వాత చాలా మంది హీరోలు రాజకీయ పార్టీలు పెట్టినా.. పెద్దగా వర్కౌట్ కాలేదు. శివాజీ గణేషణ్, విజయ్ కాంత్, కమల్ హాసన్ వంటి వాళ్లు కూడా రాజకీయాలు తమ వల్ల కాలేదని కాడి పరేసారు. తెలుగులో కూడా ఎన్టీఆర్ మినహా ఎవరు సీఎం కాలేకపోయారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో ఒడిదుడుకులు తర్వాత డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠం లక్ష్యంగా విజయ్ వేసు అడుగుటు సఫలమవుతాయా లేదా అనేది చూడాలి.

ఏది ఏమైనా తమిళనాడులో ప్రస్తుతం డీఎంకే తో పాటు బీజేపీ కూడా చాలా స్ట్రాంగ్ గా తయారైంది. పైగా విజయ్ సిద్ధాంతాలు.. డీఎంకే పార్టీకి జిరాక్స్ కాపీలా ఉన్నాయనే కామెంట్స్ కూడా వినిపడుతున్నాయి. ఇద్దరి ఓటర్లు దాదాపు ఒకటే. ఈ నేపథ్యంలో విజయ్ తాను పెట్టుకున్న లక్ష్యాన్ని సాధిస్తాడా లేదా అనేది చూడాలి.

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News