Vijay Jana Gana Mana Cancelled in 2022 ఈ ఏడాది సినిమాల పరంగా టాలీవుడ్‌కు కొంత ఉపశనమనం కలిగితే.. నిరాశ మాత్రం కొండంత కలిగింది. పెద్ద సినిమాలు బోల్తా కొట్టాయి. స్టార్ హీరోల సినిమాలను సైతం జనాలు చీ కొట్టేశారు. చిరంజీవి ఆచార్య, ప్రభాస్ రాధే శ్యామ్‌ సినిమాలు దారుణంగా బెడిసి కొట్టాయి. అయితే లైగర్ సినిమా మీద వచ్చినన్ని ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ మాత్రం ఓ రేంజ్‌లో ట్రెండ్ అయ్యాయి. లైగర్ దెబ్బకు విజయ్ తన ప్లాన్స్ అన్నింటిని మార్చుకున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూరి జగన్నాథ్‌తో చేయాల్సిన జన గణ మన సినిమాను పక్కన పెట్టేశాడు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినా కూడా ఈ సినిమాను పూర్తిగా క్యాన్సిల్ చేశాడు విజయ్ దేవరకొండ. విజయ్ అలా చేస్తే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు మాత్రం ఇంకోలా చేశారు.బుచ్చిబాబుతో ఎన్టీఆర్ఓ సినిమా చేయాల్సి ఉంది. కబడ్డీ నేపథ్యంలో సినిమా ఉంటుందని టాక్ వచ్చింది. పాన్ ఇండియాగా ఈ సినిమాను తీయాలని అనుకున్నాడు. కానీ కొరటాల శివతో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమా ఎంతకీ తేలకపోవడంతో బుచ్చిబాబు సైడ్ అయిపోవాల్సి వచ్చింది.


దీంతో బుచ్చిబాబు తన సినిమాను రామ్ చరణ్‌తో తీయాలని అనుకున్నాడు. దీంతో రామ్ చరణ్‌ ఓ ప్రాజెక్ట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడు. గౌతమ్ తిన్ననూరితో చేయాల్సిన ప్రాజెక్టును రామ్ చరణ్‌ పక్కన పెట్టేశాడు. ఈ సినిమాను కాన్సిల్ చేసుకున్న రామ్ చరణ్‌ ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో సినిమా చేసేందుకు సిద్దమయ్యాడు.


ఇక పవన్ కళ్యాణ్‌ సినిమాల సంగతి ఎంతకీ అంతు చిక్కడం లేదు. పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత వినోదయ సిత్తం రీమేక్ చేస్తాడని అన్నారు. ఇప్పటి వరకు దాని ఊసే లేకుండా పోయింది. ఇక మొన్నటి వరకు హరీష్‌ శంకర్ భవదీయుడు భగత్ సింగ్ అంటూ నానా హంగామా చేశాడు. కానీ ఆ సినిమాను క్యాన్సిల్ చేశాడు పవన్ కళ్యాణ్‌. అదే ప్లేస్‌లో అదే టైటిల్‌ను కాస్త అటూ ఇటూ మార్చి ఉస్తాద్ భగత్ సింగ్అని పెట్టి.. విజయ్ తేరీ సినిమాను రీమేక్ చేయబోతోన్నారట.


Also Read : Ponniyin Selvan 2 Release Date : పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?


Also Read : Thalapathy Vijay No 1 Hero : అందుకే విజయ్ నెంబర్ వన్ హీరో.. బల్లగుద్ది చెప్పేసిన దిల్ రాజు  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి