Vijayashanti Property : తెలుగులో హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు అంటే అప్పట్లో ముందుగా విజయశాంతి.. పేరే గుర్తొచ్చేది. ఎన్నో పవర్ఫుల్ రూల్స్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ నటి. అయితే మధ్యలో తన పర్సనల్ లైఫ్ అలానే పొలిటికల్ లైఫ్ వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విజయశాంతి.. మళ్లీ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో కనిపించింది. ఇక ఈ మధ్యనే కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రంలో మరోసారి పోలీస్ ఆఫీసర్గా కనిపించి.. ప్రశంసలు అందుకుంటుంది. ఈ నేపథ్యంలో.. విజయశాంతి ఇటీవల తన ఆస్తుల విషయంలో ఓ సంచలన నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం వైరల్ అవుతుంది.
1980ల్లో సినీరంగంలో అడుగు పెట్టిన విజయశాంతి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో క్రమంగా స్టార్ స్టేటస్‌ను సాధించారు. ఆమె ‘లేడీ అమితాబ్’ అని కూడా ప్రసిద్ధి పొందారు. పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన విజయశాంతి.. సినిమాల ద్వారా.. మంచి ఆస్తిని సంపాదించుకున్నారు.
అయితే విజయశాంతి కి పిల్లలు లేరు అన్న సంగతి తెలిసిందే. దీంతో విజయశాంతి ఆశ్రమ మొత్తం ఎవరికి వేలుతుంది అనే ప్రశ్న కొంతమంది లో మొదలయ్యింది. ఇక ఆమె పిల్లలు లేనప్పటికీ, తన ఆస్తులను ఎవరికి ఇవ్వబోతున్నారు ..అనే విషయం స్వయంగా ఈ మధ్య విజయశాంతిని మీడియాకి తెలిపింది.
విజయశాంతి తన ఆస్తులను ప్రజలకే సాకారం చేసేలా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. తన తల్లి పేరుతో ఒక ఫౌండేషన్‌ను స్థాపించి, ఆ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం రంగాలలో పలు సేవలు అందించేందుకు ఆమె ప్రణాళికలు చేస్తున్నారంట. తన వద్ద ఉన్న నగలన్నీ వెంకటేశ్వర స్వామి హుండీలో.. సమర్పించనున్నారని ఆమె తెలిపారు.
విజయశాంతి తన ఆస్తి గురించి మాట్లాడుతూనే, "నేను మరణించిన తర్వాత నా ఆస్తి ప్రజలకే దక్కాలని ప్రయత్నిస్తాను. ఈ జీవితాన్ని సమాజానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను" అని చెప్పారు.”మా అమ్మ పేరు మీద ఒక సమాజ సేవా కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నాను,” అని కూడా చెప్పకచ్చారు.
విజయశాంతి తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు, అభిమానులు ప్రశంసిస్తున్నారు. సమాజానికి తన ఆస్తిని పంచడమే కాక, తన తల్లి పేరుతో సామాజిక సేవలు చేయాలని ఆమె నిర్ణయించుకోవడం చాలా గొప్ప విషయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..
ఇదీ చదవండి: ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









