Viral News: తల్లికి పురుడు పోసిన 13 ఏళ్ల బాలుడు.. చాలా గ్రేట్ కాదా..

Viral Telugu News: సోషల్ మీడియాలో అనేక రకాల వింత సంఘటనలకు సంబంధించిన వార్తలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఇటీవలే వైరల్ అవుతున్న ఓ వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 13 ఏళ్ల బాలుడు తన తల్లి ప్రసవానికి సహాయపడడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 30, 2025, 02:52 PM IST
Viral News: తల్లికి పురుడు పోసిన 13 ఏళ్ల బాలుడు.. చాలా గ్రేట్ కాదా..

Viral Telugu News: ఇంట్లో ఉండే ఎవరికైనా మహిళలకు ప్రసవ నొప్పులు ప్రారంభం అయితే చాలు కుటుంబం మొత్తం ఎంతో భయంతో ఆందోళన చెందుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది అయితే భయపడి వెంటనే హాస్పిటల్ లో చేరుస్తారు. మరి కొన్ని దేశాల్లో నైతే హాస్పిటల్ నుంచి ఇంటికే డాక్టర్లను పిలుస్తారు.. కానీ చైనాలో టీనేజ్ బాలుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తన తల్లి పడుతున్న శ్రమను గుర్తించి బాలుడు ధైర్యంగా స్వయాన ప్రసవిస్తున్న ఆమెకు సహాయంగా నిలిచాడు. అంతేకాకుండా ప్రసవించే సమయంలో అతను ఏ మాత్రం భయపడకుండా అన్ని రకాలుగా అమ్మకు సహాయపడ్డాడు.  ఈ ఘటనకు సంబంధించిన వార్తను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రచురించింది. ఈ వార్త గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. 

Add Zee News as a Preferred Source

చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడు చేసిన గొప్ప పని ఇప్పుడు సోషల్ మీడియాను చుట్టేస్తోంది. చైనా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ బాలుడే కనిపిస్తున్నాడు.. ఇంట్లో తన తల్లి ప్రసవ వేదనకు గురైన సమయంలో ఆ బాలుడు ఏ ఏమాత్రం నెత్తుటి మరకలను చూసి భయపడకుండా ధైర్యంగా బిడ్డను జన్మనిచ్చేందుకు సహకరించాడు. అంతేకాకుండా చైనా అత్యవసర కేంద్రానికి కాల్ చేసి మరి.. జరుగుతుందంతా వివరించాడు.. తన తల్లి కడుపులో నుంచి నీరు పోతోందని.. నొప్పులతో తీవ్ర ఇబ్బంది పడుతుందని, తను ఒక గర్భవతి అని ఫోన్లో భయపడకుండా చెప్పాడు. వైద్య అధికారులు కూడా ప్రసవం ఎలా చేయాలో అని ఫోన్లో చెబితే.. 13 ఏళ్ల బాలుడు సొంతంగా వారు చెప్పినట్లు చేశారు. దీంతో ఆ తల్లి ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే చివరగా వైద్యులు కూడా హుటాహుటిన వారి ఇంటికి చేరుకున్నారు. చేరుకొని ప్రసవం తర్వాత చేయాల్సిన వైద్యాన్ని కూడా అందించారు..

 అంబులెన్స్ ఇంటికి వచ్చేంతవరకు ఆ బాలుడు డాక్టర్‌తో ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు.. అంతేకాకుండా వైద్యులు  చెప్పే సూచనలను పాటిస్తూ మరి తల్లి ప్రసవంలో భాగంగా సహాయపడ్డా. అంతేకాకుండా ఆ బాలుడికి వైద్యులు వారు ప్రసవం కోసం వైద్యం ఎలా చేస్తారో..అలాగే చెప్తే బాలుడు కూడా అదే రీతిలో చేయడంతో ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యులు కూడా వారి ఇంటికి చేరుకొని ప్రసవించిన తల్లిని బిడ్డను పరీక్షించి చూడగా.. ఇద్దరు చాలా బాగా ఆరోగ్యంగా ఉన్నారని వారు తెలిపారు. దీంతో వైద్య సిబ్బంది ఆ 13 ఏళ్ల బాలుడికి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. 

ఈ ఆశ్చర్యకరమైన సంఘటనకు సంబంధించిన వార్త చైనా సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. కొన్ని పోస్టులకు అయితే ఇప్పటివరకు 92 మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది . తన తమ్ముడికి ప్రపంచం చూపించిన బాలుడికి సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. బాలుడు చాలా తెలివిగలగా వాడు కాబట్టి ఇదంతా చేశాడని.. తెలియని వారంతా ఇదంతా చేయలేరని కొంతమంది నేటిజన్స్ అంటున్నారు. ఏది ఏమైనా తన తల్లి ప్రసవానికి సహకరించిన 13 ఏళ్ల బాలుడికి ప్రశంసలు అందడంతో అందరూ ఎంతో ఆనంద పడుతున్నారు.

Also Read: King Cobra Laying Eggs Video: నోట్లో నుంచి గుడ్డు పెట్టిన పాము.. వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News