Virgin Boys: గీతానంద్-మిత్రా శర్మ నాయికా.. నాయకులుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వర్జిన్ బాయ్స్’. రాజ్ గురు ఫిలిమ్స్ పతాకంపై రాజా దరపునేని నిర్మాతగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి యూత్ టార్గెట్ గా ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ తోనే ఈ సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేశారు మేకర్స్.స్మరణ్ సాయి, మార్తాండ్ కె వెంకటేష్, వెంకట ప్రసాద్ లాంటి టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేస్తుండంతో అంచనాలు పెరిగాయి.
సినిమా పోస్టర్ చూస్తుంటేనే దాని ఫన్ ఎలిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఓ అందమైన అమ్మాయి ముఖం, అందులో ఆమె పెదాలపై ముగ్గురు యువకులు విభిన్న శైలిలో కనిపిస్తూ ఈ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. పోస్టర్ చూస్తుంటే చాలా క్రేజీ వైబ్స్ వస్తున్నాయి. ఈ పోస్టర్ లో అమ్మాయి పెదాలపై ఒకరు కలర్‌ఫుల్ షార్ట్స్‌లో, మరొకరు స్కేట్‌బోర్డ్‌తో, మరోకరు మ్యాగజైన్‌తో నవ్వుతూ కనిపించడం ఈ సినిమా ఎలా ఉండబోతుందనే చెప్పారు. ముఖ్యంగా సునిశిత హాస్యముతో హిల్లేరియస్ కామెడీ ఎంటర్టేనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది. 'బ్రో.. ఆర్ యు వర్జిన్?' అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమా యువతలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఈ సినిమా పూర్తి హిల్లేరియస్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ఈ వేసవిలో విడుదల కానున్న ఈ సినిమా బాక్స్‌ఆఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు మేకర్స్. యువకుల మధ్య నడిచే రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్‌తో కూడిన ‘వర్జిన్ బాయ్స్’ సినిమా థియేటర్లలో మరింత ఉత్సాహాన్ని రేకెత్తించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మొత్తంగా పోస్టర్ తో ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









