Kannappa Teaser: కన్నప్ప టీజర్‌.. ప్రభాస్ లుక్‌ హైలెట్

Vishnu Manchu Kannappa Teaser: మంచు విష్ణు కన్నప్ప టీజర్ వచ్చేసింది. టీజర్‌లో ప్రభాస్ లుక్ అదిరిపోగా.. మంచు విష్ణు డైలాగ్స్ ఆడియన్స్‌ను మెప్పిస్తాయి.  

Written by - Ashok Krindinti | Last Updated : Mar 1, 2025, 12:41 PM IST
Kannappa Teaser: కన్నప్ప టీజర్‌.. ప్రభాస్ లుక్‌ హైలెట్

Vishnu Manchu Kannappa Teaser: మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న 'కన్నప్ప' సినిమా టీజర్ విడుదలైంది. ఏప్రిల్ 25న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్‌గా ఆడియన్స్‌ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన 'శివ శివ శంకరా' సాంగ్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా టీజర్‌కు కూడా అదిరిపోయింది. ముఖ్యంగా విష్ణు నటన, మ్యూజిక్, ఇతర నటుల సీన్‌తోపాటు ఆఖరిలో ప్రభాస్ లుక్ టీజర్‌కు హైలెట్‌గా నిలిచింది. కాగా ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

Add Zee News as a Preferred Source

"గూడాల మీద గండాలు దండెత్తుకొస్తున్నాయి. శత్రువులు యమకింకొరలై గూడెం మీద పడబోతున్నారు.." అంటూ టీజర్‌ను ఇంట్రెస్టింగ్‌గా స్టార్ చేశారు. 'శంకరుడి సైన్యం ఎక్కడో సన్నద్ధమై ఉంటుంది..' అంటూ మోహన్ బాబు తనదైన శైలిలో డైలాగ్ చెప్పారు. 'వాళ్లు వేలల్లో కాదు లక్షల్లో రానివ్వండి.. తేల్చుకుందాం..' అంటూ మంచు విష్ణు పవర్‌ఫుల్ డైలాగ్ చెప్పారు. 'ఇది నా ఆన.. తిన్నడి ఆన'.. 'ఆపదొచ్చిన ప్రతిసారి వీరుల తల కోరుకునే ఈ రాయి దేవత కాదు' అంటూ మంచు విష్ణు చెప్పిన డైలాగ్స్ మెప్పిస్తాయి. ఇక శివుడి పాత్రలో అక్షయ్‌ కుమార్ సరికొత్తగా కనిపించారు. పార్వతీ పాత్రను కాజల్ పోషించగా.. 'అంతటి నాస్తికుడు మీకు భక్తుడు అవుతాడా' అంటూ తిన్నడిని ఉద్దేశించి చెప్పినట్లు తెలుస్తోంది. టీజర్‌లో ప్రభాస్ లుక్ హైలెట్‌గా నిలిచింది. లాస్ట్‌లో ప్రభాస్‌తో టీజర్‌ను ఎండ్ చేశారు.

మొదటి టీజర్‌పై భారీ ట్రోలింగ్‌కు జరగ్గా.. రెండో టీజర్‌లో మేకర్స్ జాగ్రత్తలు తీసుకున్నారు. శివా శివా శంకర అనే పాటతో ప్రస్తుతం పాజిటివ్ వైబ్స్‌ ఉండగా.. ఇప్పుడు అదే కంటిన్యూ చేసేలా రెండో టీజర్‌ను కట్ చేశారు. అన్ని పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ.. 84 సెకన్ల నిడివితో టీజర్‌ను వదిలారు. ట్రైలర్‌లో అయినా ప్రభాస్ షాట్స్‌ ఎక్కువగా ఉండాలని డార్లింగ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

 

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News