Vishwak Sen: బాయ్ కాట్ లైలా అంటూ ట్రెండింగ్..పృథ్వీ మాటలకు క్షమాపణలు చెప్పిన విశ్వక్..!

Boycott Laila: లైలా చిత్ర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ పృథ్వీ మాట్లాడిన మాటలకు ఒక పార్టీ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశ్వక్ సేన్ క్షమాపణలు చెబుతూ.. మా సినిమాను చంపేయొద్దు అంటూ వేడుకొన్నారు..

Written by - Vishnupriya | Last Updated : Feb 10, 2025, 06:38 PM IST
Vishwak Sen: బాయ్ కాట్ లైలా అంటూ ట్రెండింగ్..పృథ్వీ మాటలకు క్షమాపణలు చెప్పిన విశ్వక్..!

Vishwak Sen Apologies: ప్రముఖ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం లైలా. ఇందులో తొలిసారి ఆయన లేడీ గెటప్ వేశారు. భారీ అంచనాల మధ్య ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే నిన్న హైదరాబాదులో చాలా ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

Add Zee News as a Preferred Source

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే అనిల్ రావిపూడి కూడా గెస్ట్ గా విచ్చేశారు. ఈ సందర్భంగా 30 ఇయర్స్ పృథ్వీ ఈ వేదికపై వైసిపి పార్టీని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అటు అల్లు అర్జున్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే #బాయ్ కాట్ లైలా అంటూ దాదాపు 25 వేల ట్వీట్లు వేశారు అంటే ఇక పృథ్వి అన్న మాటలు వారిని ఏ రేంజ్ లో ఆగ్రహానికి గురి చేశాయి అర్థం చేసుకోవచ్చు. 

ఇక వార్తలు తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో వెంటనే హీరో విశ్వక్సేన్ ఆ చిత్ర నిర్మాత సాహూ గారపాటి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి అభిమానులకు క్షమాపణలు తెలియజేశారు. విశ్వక్సేన్ మాట్లాడుతూ.. స్టేజ్ పై పృథ్వీ మాట్లాడినప్పుడు మేము అక్కడ లేము. చిరంజీవి గారు వస్తే ఆయనను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము. ఒకవేళ ఆయన మాట్లాడేటప్పుడు మేము ఉండి ఉంటే కచ్చితంగా నేను ఆయన దగ్గర నుండి మైకు లాగేసుకునే వాడిని. నా సినిమాను 25 వేలమంది బాయ్కాట్ చేయాలంటూ ట్వీట్లు పెట్టారు. హెచ్డి ప్రింట్ లీక్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఒకరు చేసిన తప్పుకు మేమెందుకు బలి అవ్వాలి.దయచేసి ఆయన మాట్లాడిన మాటలకు మాకు ఎటువంటి సంబంధం లేదు.  మా సినిమాను చంపేయొద్దు అంటూ వేడుకున్నారు విశ్వక్సేన్. ఇక విశ్వక్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. 

ఇక ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్వి ఏమన్నారు అనే విషయానికి వస్తే. ఇందులో మేకల సత్తిగా పృధ్వీ నటించారు. దీనిపై మాట్లాడుతూ ఇందులో  మేకలు ఎన్ని ఉన్నాయని షాట్ మధ్యలో అడిగితే 150 ఉన్నాయని చెప్పారు. యాదృచ్ఛికమో ఏమో కానీ సినిమా చివర్లో లెక్కిస్తే కరెక్ట్ గా 11 గొర్రెలే ఉన్నాయని తెలిపారు. ఇదేంటో అర్థం కాలేదని, అన్నీ సినిమాల్లో బ్రహ్మాండంగా పెట్టారు అంటూ పృథ్వీ కామెంట్లు చేశారు. దీంతో రాజకీయ చిచ్చు పెట్టినట్టు అయింది. దీంతో వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు

Also Read: Allu Arjun Mama: హీరో అల్లు అర్జున్‌కు మరో షాక్.. 'మామ' చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు కూల్చివేత?

Also Read: Radish Juice: ముల్లంగిని ఇలా తీసుకుంటే 'కొవ్వు' కొండలా కరిగించేస్తుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News