Laila OTT News: ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు రెండు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 7న ఈ సినిమా ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒకేసారి స్ట్రీమింగ్ కు రానుంది. దీంతో ఈ సినిమాను థియేట్రికల్ చూడని ప్రేక్షకులు ఇపుడు ఎంచక్కా ఓటీటీ వేదికగా చూడొచ్చు. లైలా మూవీ విషయానికొస్తే.. విశ్వక్ సేన్ ఈ సినిమాలో ఆడ వేషంలో నటించడం విశేషం. ఈ క్యారెక్టర్ కోసం ఎంతో కష్టపడ్డా.. సరైన కథ, కథనం లేకపోవడంతో ఈ సినిమా తేలిపోయింది.
మరోవైపు ఈ సినిమా ప్రీ రిలీజ్ లో నటుడు 30 ఇయర్స్ పృథ్వీ చేసిన కామెంట్స్ ఏపీలో ప్రతిపక్ష వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఈ సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపు నిచ్చారు. ఈ సినిమా ఫ్లాప్ కు తోడుగా నిలిచింది.మరోవైపు విశ్వక్ సేన్ ఈ వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదు.. ఎవరైనా హర్ట్ చేసి ఉంటే క్షమించమని వేడుకున్నా.. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
సినిమా విడుదలయ్యాకా.. బాయ్ కాట్ చేయాలన్న వైసీపీకి వాళ్లకు ఛాన్స్ ఇవ్వకుండా.. విశ్వక్ సేన్ సినిమాను ఆడియన్స్ బాయ్ కాట్ చేశారు. ఓ రకంగా వైసీపీ నేతలకు పని లేకుండా ప్రజలే ఈ చిత్రాన్ని దారుణంగా తిప్పికొట్టారు. మొత్తంగా వల్గర్ అడల్ట్ కామెడీ కంటెంట్ తో తెరకెక్కిన లైలా మూవీ ఏ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకోలేపోయింది. మరోవైపు విశ్వక్ సేన్ లుక్.. అమ్మాయికి తక్కువా.. హిజ్రాలకు ఎక్కు ఉందనే కామెంట్స్ నెటిజన్స్ నుంచి వినిపించాయి. ఈ రకంగా విశ్వక్ నటను ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల వేదికగా ఏకి పారేసారు. మొత్తంగా విశ్వక్ సేన్ అమ్మాయి పాత్ర కోసం పడ్డ కష్టం వర్ధ్యం అయింది. మొత్తంగా విశ్వక్ సేన్ కెరీర్ లోనే రూ. 1 కోటి లోపు షేర్ అందుకొని దాదాపు 90 శాతం నష్టాలతో ఆల్ టైమ్ డిజాస్టర్ మూవీలో ఒకటిగా నిలిచింది. అంతేకాదు ఈ ఇయర్ అతిపెద్ద ఫ్లాపుల్లో ఒకటిగా నిలిచింది.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









