Waltair Veerayya: వాల్తేరులోనే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్!
Waltair Veerayya Pre Release Event: మెగాస్టార్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది.
Waltair Veerayya Pre Release Event at Waltair on January 8th: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. దర్శకుడు బాబీ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. నిజానికి రాజకీయాల్లోకి వెళ్లి సినిమాల్లోకి రీయంట్రీ ఇచ్చిన తర్వాత సైరా, ఆచార్య సినిమాలు మినహా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న సినిమాలన్నీ రీమేక్ సినిమాలే కావడంతో ఈ ఒక్క సినిమా మీద ప్రేక్షకులతో పాటు మెగా అభిమానుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమాతో హిట్ అందుకుంటామని వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇక ఈ సినిమాని జనవరి 13వ తేదీ సంక్రాంతి సందర్భంగా విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన అన్ని అప్డేట్స్ కూడా తెరమీదకి తీసుకు తెస్తున్నారు. సినిమా యూనిట్ ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ మరో లెవల్లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమా టైటిల్కు తగినట్లుగానే విశాఖపట్నంలోని వాల్తేరులో నిర్వహించేందుకు సినిమా యూనిట్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ నుంచి మెగా అభిమానులు ఒక స్పెషల్ ట్రైన్లో ఈ వాల్తేరు వీరయ్య ఈవెంట్ కి హాజరయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలకపాత్రలో నటిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా టాలీవుడ్ లోని అనేకమంది సీనియర్ నటీనటులు కూడా సినిమాలో భాగమయ్యారు. ఇక ఈ సినిమా ఒకపక్క నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమాతో పోటీపడుతూనే మరో పక్క తమిళ్ స్టార్ విజయ్, వారసుడు సినిమాతో కూడా పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయ్, వీర సింహారెడ్డి సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతూ ఉండగా ఈ సినిమా మాత్రం 13వ తేదీ సింగిల్ గా రిలీజ్ అవుతుంది.
అయినా సరే ఆ రెండు సినిమాలకు థియేటర్లు కేటాయించిన తర్వాత ఈ సినిమాకు ఎంతవరకు థియేటర్లు దక్కుతాయి అనేది చూడాల్సి ఉంది. మొత్తం మీద ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ట్రైన్ లో వెళ్లిన వ్యవహారం ఇప్పటిది కాదు. ఆ రోజుల్లోనే ఆంధ్రావాలా సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాదు నుంచి అనేక రైళ్లు బస్సులు ఇతర వాహనాల్లో లక్షలాది మంది అభిమానులు నిమ్మకూరుకి వెళ్లారు. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఇలా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ట్రైన్ లో హాజరవుతూ ఉండడం సంచలనం రేపుతోంది.
Also Read: Coconut Milk: ఈ పాలతో ఎలాంటి ఖర్చు లేకుండా చుండ్రుకు శాశ్వతంగా గుడ్ బై చెప్పండి..
Also Read: Vijay Devarakonda Kushi : సమంత వల్ల మరింత ఆలస్యం.. విజయ్ 'ఖుషీ' ఇప్పట్లో లేనట్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook