)
War 2 First Review: అయాన్ ముఖర్జీ డైరెక్షర్ లో యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. ఈచిత్రంలో తెలుగు స్టార్ హీరో ఎన్టీఆర్, హిందీ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. ఈ సినిమా ఎన్టీఆర్, హృతిక్ మధ్య వార్ సీన్స్ తో పాటు వీళ్లిద్దరి పై చిత్రీకరించిన పాట కూడా హైలెట్ గా నిలవనుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
హిందీలో ఈ సినిమా 2 గంటల 53 నిమిషాల 24 సెకన్లు ఉంది. తెలుగు, తమిళంలో ఈ సినిమా 2 గంటల 51 నిమిషాల 44 సెకన్లు ఉంది. ఒకటిన్నర నిమిషం తేడా ఉంది. ఈ సినిమా సెన్సార్ వాళ్లు యాక్షన్ సీన్స్ తో పాటు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ ఓ రేంజ్ లో ఉందని చెబుతున్నారు. అజ్ఞాతంలో ఉన్న హృతిక్ ను పట్టుకునేందుకు భారత స్పై ఏజెంట్ ఎన్టీఆర్ ను పంపుతుంది. వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్స్.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్యాంక్ అన్ని గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నట్టు చెబుతున్నారు. ఇక చిత్రంలో ఇద్దరి మధ్య వచ్చే పాట హైలెట్ గా నిలవనుంది. ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటు తర్వాత ఈ సాంగ్ ఓ రేంజ్ లో హైలెట్ గా నిలవనున్నట్టు చెబుతున్నారు.
భారతీయ సినీ చరిత్రలో మోస్ట్ ఎనర్జిటిక్‌గా, విజువల్ ఫీస్ట్‌లా ఉండబోయే ఈ పాట డాన్స్ సీక్వెన్సుల్లో అద్భుతంగా ఉండనుంది. ఈ చిత్రాన్నిఐమ్యాక్స్ ఫార్మాట్ లో రిలజ్ చేస్తున్నారు. అంతేకాదు డాల్మీ అట్మాస్ లో విడుదల కాబోతున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కనుంది. ఈ సినిమా స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 14న విడుదల కాబోతుంది.
‘వార్ 2’ మూవీ కోసం హృతిక్ రోషన్.. రూ. 40 కోట్ల పారితోషికం తీసుకుంటే.. ఎన్టీఆర్ రూ. 70 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగ వంశీ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు సమాచారం. మరోవైపు హిందీలో రూ.150 కోట్లు... తమిళంలో రూ. 18 కోట్లు.. మలయాళంలో రూ. 5 కోట్లు.. ఓవర్సీస్ లో రూ. 102 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 355 కోట్ల ప్రీ రిలీజ్ పూర్తి చేసినట్టు సమాచారం. మరి ఈ సినిమా ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.