Warm Felicitation of Telugu Senior film Journalists:తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ సౌజన్యంతో... "ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్" ధీరజ అప్పాజీ నేతృత్వంలో "స్వాతిముత్యం" సినీ - సాంస్కృతిక - సాహిత్య - సామాజిక సేవాసంస్థ సారధ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు - పి.ఆర్.ఒ లు, ఫోటో జర్నలిస్టుల సత్కార కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ లోని తెలుగు నిర్మాతల మండలి సమావేశ మందిరంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ తెలుగు నటుడు మురళీమోహన్, శ్రీమతి సురభి వాణి దేవి MLC, ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్.ఎన్. సి.సి) అధ్యక్షులు క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు, ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ తో పాటు భగవద్గీతను తన వంతుగా ఊరూ వాడా ప్రచారం కల్పిస్తోన్న బ్రహ్మశ్రీ ఎల్.వి.గంగాధర్ శాస్త్రి, శ్రీమతి గిడుగు కాంతికృష్ణ, ప్రముఖ దర్శక నిర్మాత కూచిపూడి వెంకట్, ఫిల్మ్ జర్నలిస్ట్ టర్నడ్ లిరిసిస్ట్ భాస్కరభట్ల హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మిమిక్రి లెజండ్ రమేష్, పాకలపాటి విజయవర్మ, ప్రొడ్యూసర్ బజార్ విజయ్, సెల్సియస్ సిస్టమ్స్ - హోమ్ ఎలివేటర్స్ శ్రీనివాస్, సినేటరియా వెంకట్, తెలుగుప్లెక్స్ వెబ్ సైట్ CEO ఎన్నారై కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు. సుమారు నలభై మంది సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు... ఫోటో జర్నలిస్టులు... పి.ఆర్.ఓలను ఒకే వేదికపైకి సన్మానం చేసారు. దాదాపు 4 నుంచి 5 దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుగా తల పండిపోయన సరస్వతి పుత్రలను "స్వాతిముత్యం" అప్పాజీని ఎంతో ఆత్మీయంగా అతిథి మర్యాదలతో సత్కరించడంతో సీనియర్ జర్నిలిస్టులు అందరు పులకించిపోయారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ చైన్నలో ఉన్నప్పటి నుంచి పనిచేస్తోన్న ఈ ఫిల్మ్ జర్నలిస్టులను ఒకే వేదికపై తీసుకొచ్చిన అప్పాజీ కృషిని వ్యక్తలు అభినందించారు.
మరోవైపు సీనియర్ జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, పి.ఆర్.ఓలతో తమకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అప్పాజీ. అలాగే అప్పాజీతో తమ అనుబంధాన్ని ఎంతో ఇష్టంగా నెమరువేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు చెన్నై నుంచి వచ్చిన శ్రీమతి పాటిబండ్ల విజయలక్ష్మి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
సీనియర్ జర్నలిస్ట్ - రైటర్ అండ్ డైరెక్టర్ ప్రభు సభాధ్యక్షత వహించిన ఈ వేడుకలో... సీనియర్ జర్నలిస్టులు శ్రీమతి పాటిబండ్ల విజయలక్ష్మి, శ్రీమతి కోగంటి జమునారాణి, సర్వశ్రీ సామల జగన్మోహన రావు (జగన్), యు.వినాయకరావు, ప్రభు, ఎల్.వి.గంగాధర శాస్త్రి, భాస్కరభట్ల, మోహన్ గోటేటి, పసుమర్తి నాగేంద్ర కుమార్, రామ నారాయణ రాజు.కె., ఈతరం సూర్య ప్రకాష్ రెడ్డి, వి.ఎస్.కేశవరావు, వల్లూరు రాఘవరావు, మామిడిపల్లి గిరిధర్, రెంటాల జయదేవ, బత్తుల ప్రసాద్, నాగభైరు సుబ్బారావు, వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ, ప్రసన్న ప్రదీప్, రమణ జె.పి.వి., లంక రాంబాబు వర్మ, ఫోటో జర్నలిస్టులు రామసాయి రమేష్, ఇటికాల జనార్దన్ రెడ్డి, గోపిశెట్టి శ్రీనివాస్, వర్కింగ్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు.. కార్యదర్శి ఎమ్.ఎన్. భూషణ్, వాసు సజ్జా, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కొండేటి, ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.జె.రాంబాబు స్వాతిముత్యం పత్రిక తరుపున అందించిన చిరు సత్కారాన్ని ఎంతో ఆప్యాయంగా స్వీకరించారు.
ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్టులు హేమసుందర్, యజ్ఞమూర్తి, ఆర్.డి.ఎస్.ప్రకాష్, రాఘవేంద్రరెడ్డి, పులగం చిన్నారాయణ, ఫిల్మ్ జర్నలిస్ట్ టర్నడ్ డైరెక్టర్ నాగు, ఎమ్.డి.అబ్దుల్, శివ మల్లాల, కేశవ, రమణబాబు, శ్రీపాల్, లక్ష్మీ పెండ్యాల, కార్టూనిస్ట్ - రైటర్ - డైరెక్టర్ గాంధి మనోహర్, చిత్రాంజలి అధినేత జె.పి., దర్శకులు సత్తిబాబు, బిజినెస్ కో-ఆర్డినేటర్ నారాయణ, కో-డైరెక్టర్ రేణుక తదితరులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో మిమిక్రి లెజండ్ రమేష్ తనదైన శైలిలో చేసిన ధ్వన్యనుకరణ, విసిరిన ఛలోక్తులు ఆహుతుల పొట్టలు చెక్కలు చేశాయి.
తాను ఫిల్మ్ ఇండస్ట్రీ పట్ల ఆకర్షితుడ్ని కావడానికి పరోక్ష కారకులైన సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులకు.. ఈ సందర్భంగా ఉడతా భక్తిగా చిరు సత్కారం చేసే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు కార్యక్రమ నిర్వాహకుడు ధీరజ అప్పాజీ. కార్యక్రమ నిర్వహణకు వెన్నుదన్నుగా నిలిచిన శ్రీమతి గిడుగు కాంతికృష్ణ, "కూచిపూడి పలావ్" అధినేత కూచిపూడి వెంకట్, షీరో హోమ్ ఫుడ్స్ పాకలపాటి విజయ్ వర్మ, "ప్రొడ్యూసర్ బజార్" విజయ్, "సెల్సియస్ సిస్టమ్స్ - హోమ్ ఎలివేటర్స్" శ్రీనివాస్, స్విస్ క్యాజిల్, మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్స్ ప్రతినిధి సినేటెరియా వెంకట్, తెలుగుప్లెక్స్ CEO ఎన్నారై కొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి లకు ఈ సందర్భంగా అప్పాజీ ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..
ఇదీ చదవండి: కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









