Chaurya Paatam Trailer: స్టార్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై చౌర్య పాఠం అనే సినిమాను ఆయన నిర్మిస్తున్నారు. క్రైమ్-కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాతో ఇంద్రా రామ్ హీరోగా పరిచయం అవుతున్నారు. నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ బ్యూటీ పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటిస్తోంది. రాజీవ్ కనకాల, మస్త్ అలీ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 25న గ్రాండ్‌గా థియేటర్‌లో రిలీజ్ కానుంది. ఈ నేప్యథ్యంలోనే ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ విషయానికి వస్తే.. ధనపల్లి అనే గ్రామంలో బ్యాంక్ దొంగతనం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఓ ముఠాకు అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేదే చౌర్యపాఠం. ట్రైలర్‌ను కామెడీతో పాటు కథను లైటర్ వీన్‌లో అర్థమయ్యేలా చక్కగా కట్ చేశారు. హీరో ఇంద్రరామ్ తనకు మొదటి సినిమా అయినా.. చక్కటి హవాభావాలు పలికించాడు. డైలాగ్ డెలవరీ సెట్ అయింది. డేవ్ నేపథ్య సంగీతం చాలా బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. త్రినాథరావు నక్కిన ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్‌తో మరిన్ని అంచనాలు క్రియేట్ చేశారు మేకర్స్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తవ్వగా తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు.
రవితేజతో ధమాకా సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న త్రినాథరావు నక్కిన.. ఇటీవల మజాకా సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి చౌర్యపాఠం మూవీ నిర్మిస్తుండడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. టైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన చేసిన కామెంట్స్ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం సినిమాల పరిస్థితి దారుణంగా ఉందని.. ప్రజలు థియేటర్లకు రావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ సమయంలో చాలా థియేటర్లు తిరిగానని.. కొన్ని చోట్ల సెకెండ్ షోలు క్యాన్సిల్ చేస్తున్నారని అన్నారు. చౌర్య పాఠం మూవీ ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.
టెక్నికల్ టీమ్:
==> రచయిత & దర్శకుడు- నిఖిల్ గొల్లమారి
==> నిర్మాత: త్రినాధరావు నక్కిన & వి చూడామణి
==> కథ & DOP - కార్తీక్ గట్టమ్నేని
==> ప్రొడక్షన్ హౌస్: త్రినాధరావు నక్కిన నరేటివ్
==> ప్రొడక్షన్ డిజైనర్: నాగేంద్ర తంగాల
==> సినిమాటోగ్రాఫర్ - సతీష్ మెంటెం
==> సంగీత దర్శకుడు: దావ్‌జాంద్
==> ఎడిటర్: ఉత్తర
==> కొరియోగ్రాఫర్‌లు: విజయ్ పోలాకి, విజయ్ బిన్ని
==> సహ నిర్మాత: NVSS సురేష్
==> PRO: వంశీ-శేఖర్
==> పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను
Also Read: Liquor Prise hikes: మందు బాబులకు బిగ్ షాక్.. ఏ బ్రాండ్ ధర ఎంత పెరగనుందంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









