Weather Update: తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎన్నడు లేనట్టుగా భారీ వర్షాలు పడ్డాయి.వాతావరణం వేడిక్కి మేఘాలు ఏర్పడటంతో ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. రోడ్లన్ని నీట మునిగాయి. గురువారం సాయంత్రం కురిసిన వర్షంతో ఒక్కసారిగా జన జీవనం స్థభించిపోయింది. పలు చోట్ల పోయిన కరెంట్ ఉదయం వరకు రాలేదు. మరోవైపు భారీ వర్షాలతో పలు చోట్ల పంటలు నీట మునిగాయి. అకాల వర్షంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యంతో పాటు మిరప పంట మొత్తం తడిసి ముద్దైయింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర,దక్షిణ ద్రోణి ఉత్తర మధ్య మహారాష్ట్ర నుండి అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్రమట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో ఏర్పడింది. దీంతో ఈ రోజు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
దీంతో రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం తెలంగాణ సాధారణ ఉష్ణోగ్రతలే నమోదు అయ్యాయి. కానీ మరో రెండు మూడు రోజుల తర్వాత మూడు నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఆది, సోమవారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









