Jr NTR Wife: సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత జీవితానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. ఏమాత్రం సినిమాల నుంచి గ్యాప్ వచ్చినా కుటుంబంతో గడిపేస్తారు. ఇంట్లో.. లేదంటే విదేశాలకు చెక్కేస్తారు. అక్కడ హాయిగా కుటుంబంతో ఎన్టీఆర్ గడుపుతారు. తాజాగా జపాన్ పర్యటనలో ఉన్న ఎన్టీఆర్ అటు సినిమాలతో.. ఇటు కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన సతీమణి లక్ష్మీ ప్రణతి జన్మదినం రావడంతో జపాన్ లోనే ఎన్టీఆర్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన సతీమణిని ముద్దుగా 'అమ్ములు' అని ఎన్టీఆర్ పిలవడం వైరల్ గా మారింది. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి బర్త్ డే ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read: Free Parking: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. మాల్స్, మల్టీప్లెక్స్‌లో పార్కింగ్ ఫ్రీ.. ఫ్రీ
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ వార్-2 చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన 'దేవర' సినిమా మార్చి 28వ తేదీన జపాన్‌లో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర ప్రచార కార్యక్రమాల కోసం ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. ప్రమోషన్స్ కోసం తన సతీమణితో కలిసి జపాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన ప్రణతి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి జన్మదిన వేడుకలు నిర్వహించారు. వాటికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ ఎన్టీఆర్ 'అమ్ములు.. హ్యాపీ బర్త్ డే' అంటూ పోస్ట్ చేశారు.
Also Read: Tax Payers: పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్.. 50 శాతం భారీ డిస్కౌంట్!
ఈ పోస్ట్ వైరల్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తన భార్యను ముద్దుగా ఏమని పిలుస్తారో తెలిసిపోయింది. అమ్ములు అని ప్రేమగా పిలవడంతో నెటిజన్లు.. ఎన్టీఆర్ అభిమానులు లైకులు.. షేర్లు చేస్తున్నారు. గతేడాది కూడా ఎన్టీఆర్ తన భార్యకి 'హ్యాపీ బర్త్ డే అమ్ములు' అని విష్ చేశాడు. 2011లో ఎన్టీఆర్‌తో లక్ష్మి ప్రణతి వివాహమైన విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే 'దేవర' పార్ట్ -2 రాబోతున్నది. శ్రీదేవి కూతురు, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ తో కలిసి నటించిన తొలి భాగం విజయం సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. దేవర తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయనున్నాడు. త్వరలో వార్ 2 చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









