Pan India No.1 Hero: ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్.. పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ఎవరు..?

Allu Arjun Vs Prabhas:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నంబర్ వన్ హీరో ఎవరు అనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో మరి పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇంతకాలం పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ఎవరు అంటే ప్రభాస్ పేరు చెప్పేవారు. కానీ ఇప్పుడు సమీకరణలు మారాయి అని చెప్పాలి.

Written by - Vishnupriya | Last Updated : Dec 9, 2024, 04:05 PM IST
Pan India No.1 Hero: ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్.. పాన్ ఇండియా నంబర్ వన్ హీరో ఎవరు..?

Who is no.1 hero in Tollywood: ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో మంచి విజయం సాధించాడు అంటే అందరిలో ఊహించని ఇమేజ్ దక్కించుకుంటారు. అందుకే ప్రాంతీయంగా నెంబర్వన్ స్థానాన్ని దక్కించుకున్న చాలామంది ఆ తర్వాత కాలంలో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్నారు టాలీవుడ్ హీరోలు.

Add Zee News as a Preferred Source

రెబల్ స్టార్ ప్రభాస్ ఎప్పుడైతే బాహుబలి సినిమా చేసి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారో.. ఇక ఆ తర్వాత చాలామంది తెలుగు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోని ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి హీరోలు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్న విషయం తెలిసిందే..

ఇకపోతే ఇప్పటివరకు పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరు అంటే అందరూ ప్రభాస్ పేరు చెబుతారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ లెక్కలు మారిపోయాయని చెప్పవచ్చు. పుష్ప 2 సినిమాతో అద్భుతమైన విజయం సాధించి, ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ స్టార్ హీరోగా ఎదిగారు అల్లు అర్జున్. ముఖ్యంగా హిందీలో కూడా అత్యధిక వసూలు సాధించిన తెలుగు చిత్రంగా అవతరించడంతో అల్లు అర్జున్ స్టార్ డం భారీగా పెరిగిపోయింది. 

వాస్తవానికి అల్లు అర్జున్ కి ఇది ప్రారంభం మాత్రమే. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ ను అధిగమించాలని లక్ష్యంగా పెట్టుకుని ఉంటే కచ్చితంగా రెండు మూడు సంవత్సరాలు అయ్యేది. కానీ తన స్టామినాలను నమ్ముకున్నాడు కాబట్టి నేడు నంబర్ వన్ పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ ఇదే స్థానంలో కొనసాగాలి అంటే ప్రతిసారి రూ.500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయాల్సిన అవసరం లేదు. నిలకడగా రూ.300 కోట్ల కలెక్షన్స్ వసూల్ చేస్తే ఆయన స్థితి పటిష్టంగా ఉంటుందని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Also read: Bank Holidays 2024: రేపట్నించి ఈ నెలలో 12 రోజులు మూతపడనున్న బ్యాంకులు, ఎప్పుడంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్- https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్- https://apple.co/3loQYe 

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News