Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఏమిటంటే..?

Sudigali Sudheer marriage: సుడిగాలి సుధీర్ .. ఒకప్పుడు రష్మీని పెళ్లి చేసుకుంటారు అనే వార్త తెగ వైరల్ అవుతూ వచ్చింది. కానీ అవన్నీ కేవలం షో టి‌.ఆర్.పి కోసమే అని కొద్ది రోజులకు అర్థమైంది. ఈ క్రమంలో అసలు సుధీర్ ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది 

Written by - Vishnupriya | Last Updated : May 23, 2025, 03:38 PM IST
Sudigali Sudheer: సుడిగాలి సుదీర్ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఏమిటంటే..?

Sudigali Sudheer Wedding Update : సుడిగాలి సుధీర్.. గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అవసరం లేదు. మెజీషియన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి, ‘జబర్దస్త్’ కార్యక్రమంలో తన హాస్యంతో ప్రేక్షకులను మెప్పించాడు. యాంకర్‌గా, నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుధీర్, ఇప్పుడు కూడా బుల్లితెరపై స్టార్ స్థాయిలో కొనసాగుతున్నాడు.

Add Zee News as a Preferred Source

అయితే సుధీర్ పెళ్లి విషయమై చాలామంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కొద్ది రోజులు ఈయన యాంకర్ రష్మీని పెళ్లి చేసుకుంటారు అనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. దానికి తగ్గట్టు ఈటీవీలో ప్రతి షోలో కూడా వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు చూపిస్తూ వచ్చారు. అయితే ఫైనల్ గా ఒక ఇంటర్వ్యూలో తాము స్నేహితులమే అని తమ మధ్య ప్రేమ లేదు అంటూ వీరు క్లారిటీ ఇచ్చారు. ఇక అప్పటివరకు వీరిద్దరి మధ్య చూపించిన ప్రేమ మొత్తం టిఆర్పి కోసమే అని అందరికీ క్లారిటీ వచ్చింది. ఇక ఆ తర్వాత సుధీర్ కి, విష్ణు ప్రియా కి మధ్య కూడా ఏదో ప్రేమ ఉందని వార్తలు రాగా.. అవి కూడా పుకార్లే అని కొద్ది రోజులకు అర్థమైంది. ఇక ప్రస్తుతం మాత్రం..అతను ఎందుకు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదన్నదానిపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఇక అసలు సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం.. గురించి జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ భార్య శిరీష మాట్లాడుతూ – “సుధీర్‌కి పెళ్లిపైన ఆసక్తి లేదు.‌అతను ఒకే చోట స్థిరపడాలని అనుకోవడం లేదు. పెళ్లి చేసుకుంటే ఒకే దగ్గర స్ట్రక్ అవ్వాల్సి వస్తుంది. అలా సుధీర్ కి ఇష్టం లేదు. అందుకే పెళ్లి చేసుకోవడం లేదు” అని చెప్పారు. పెళ్లి అంటే బాధ్యత, స్థిరత అని భావించే సుధీర్‌కి ప్రస్తుతం పెళ్లిపైన ఆలోచన లేదు అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం సుధీర్ తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టి కొనసాగుతున్నారు. ఇటీవల ఈటీవీ చానల్‌లో ‘ఫ్యామిలీ స్టార్స్’ అనే కొత్త షోతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం కూడా త్వరలో విడుదల కానుంది.

అయితే ధనరాజ్ భార్య శిరీష సుధీర్.. ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవచ్చని.. కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ ఒక్క కారణం వల్లే తను పెళ్లి వైపు కూడా చూడడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. మరి ప్రస్తుతం ఉన్న షోలు, షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు అయ్యాక.. సుధీర్ పెళ్లి చేసుకుంటారా లేదా అనేది ప్రస్తుతం అందరిలో ఉన్న సందేహం.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ యాక్ట్ చేసిన ఏకైక టీవీ సీరియల్ గురించి తెలుసా.. అసలు ఎక్స్ పెక్ట్ చేయరు..

ఇదీ చదవండి:   కేవలం 5 నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మార్చే వంటింటి చిట్కా.. అసలు మిస్ కావొద్దు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News