HBD Mohan babu: తెలుగు సినీ చరిత్రలో ఆ రికార్డు ఒక్క మోహన్ బాబుకే సొంతం..

HBD Mohan babu: తెలుగు సినీ చరిత్రలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోగా టర్న్ తీసుకొని ఆ తర్వాత ప్రతినాయకుడిగా,  తీసుకొని.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా మెప్పించి.. మళ్లీ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో కలెక్షన్ కింగ్ అనిపించుకున్న ప్రపంచ  సినీ చరిత్రలో ఏకైన నటుడు  మోహన్ బాబు మాత్రమే అని చెప్పాలి.  కేవలం హీరోగానే కాకుండా.. నిర్మాతగా పలు చిత్రాలను తెరకెక్కించారు. త్వరలో నటుడిగా 50 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్నారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 18, 2025, 07:20 PM IST
 HBD Mohan babu: తెలుగు సినీ చరిత్రలో  ఆ రికార్డు  ఒక్క మోహన్ బాబుకే సొంతం..

HBD Mohan babu: మోహన్ బాబు అంటేనే పాత్రల్లో వైవిధ్యం, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్..సినీ పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో మోహన్ బాబు ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో పాత్రల్లో ఆయన చూపించిన అంకితభావం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచిందనే చెప్పాలి. 1975 హీరోగా ‘స్వర్గం నరకం’ సినిమాలో విలన్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలో నటించారు. ఆ తర్వాత 1990 వరకు, మోహన్ బాబు  భారతీయ సినిమాల్లో ప్రతి నాయక పాత్రకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారనే చెప్పాలి.  దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న విలన్ గా ఒకరిగా నిలిచారు. అంతేకాదు ఏ పాత్ర చేసిన తన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు.ఈయన 1946 మార్చి 19న తిరుపతిలో జన్మించారు.1990వ దశకం ముందు వరకు అడపదడపా హీరోగా నటించినా పెద్దగా బ్రేక్ రాలేదు. కానీ మోహన్ బాబు హీరోగా ‘అల్లుడు గారు’ సినిమాతో హీరోగా సత్తా చూపెట్టారు. ఆ తర్వాత అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఆయనను స్థాయిని పెంచాయి.పెదరాయుడు విజయోత్సవాల్లో 200 రోజుల వేడుక తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. 

Add Zee News as a Preferred Source

ఈ చారిత్రక వేడుకకు మొత్తం రాష్ట్ర రాజకీయ కేబినెట్,ముఖ్యమంత్రి హాజరు కావడం విశేషం. ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టంగా నిలిచింది.ఈ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. ఇది మోహన్ బాబు గారి క్రేజ్‌కు నిదర్శనం అని చెప్పారు.ఈయన టీడీపీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు.

సినిమా, రాజకీయాల్లో కీలక ఘట్టంగా మేజర్ చంద్రకాంత్ మోహన్ బాబు గారి ప్రభావం సినిమాలపై మాత్రమే కాకుండా రాజకీయ రంగానికీ విస్తరించింది. 1993లో ఆయన నిర్మించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం.. అన్న ఎన్టీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీ రూల్  ప్లే చేసింది. ఈ చిత్ర 100 రోజుల వేడుక తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సభ సినిమా, రాజకీయ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా ఆవిష్కృతమైంది.

విద్యా రంగంలో విప్లవం.. సినిమా రంగం తర్వాత  మోహన్ బాబు  విద్యా రంగంలోనూ విశేషమైన సేవలను అందించారు. 1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. గత 30 యేళ్లుగా  25% ఉచిత విద్య అందిస్తూ అనేక పేద విద్యార్థులకు అభివృద్ధి అవకాశాలను సృష్టించారు. 2022లో ప్రారంభమైన మోహన్ బాబు విశ్వవిద్యాలయం విద్య పట్ల వారి అంకితభావానికి నిదర్శనంగా నిలిచింది.

మోహన్ బాబు  అనేక తన సుధీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో పురస్కారాలను  అందుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రధానం చేసింది. 2016 ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కలెక్షన్ కింగ్ ను  వరించింది.2024 డిసెంబర్ నుండి ప్రతి నెల ప్రత్యేక ఈవెంట్లను ప్రారంభిస్తారు. 2025 నవంబర్‌ వరకు ప్రతీ నెలా ఒకటో తేదీన ఈ ఈవెంట్‌లకు సంబంధించిన ప్రకటన వస్తుందని తెలిపారు.
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో మోహన్ బాబు  మహాదేవ శాస్త్రిగా అలరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలిచే అవకాశాలున్నాయి.

సామాన్య వ్యక్తిగా మొదలై.. అసామాన్య వ్యక్తిగా మోహన్ బాబు ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. సినిమా రంగంలో ఇన్నేళ్ల పాటు సేవలు అందిస్తూ వస్తున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ 75 చిత్రాలను నిర్మించారు. ఓ నటుడు ఇలా నిర్మాతగా మారి 75 చిత్రాలు నిర్మించడం అనేది భారతీయ సినీ చరిత్రలో మరో రికార్డ్. ఎక్కువ సినిమాలను నిర్మించిన నటుడు భారతీయ సినీ పరిశ్రమలో ఎవరు లేరు. మొత్తంగా మార్చి 19న పుట్టిన రోజు జరుపుకుంటూన్న మోహన్ బాబుకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది జీ మీడియా.

ఇదీ చదవండి:  నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?

ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News