Toxic: కేజీఎఫ్ సినిమాతో ప్యాన్ ఇండియా లెవల్లో అలరించిన యశ్.. ఇపుడు ‘టాక్సిక్’ మూవీతో ఏకంగా ప్యాన్ వరల్డ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. మన దేశంలో ఒక సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ అయిన తర్వాత వివిధ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కానీ ‘టాక్సిక్’ మూవీ ఒకేసారి కన్నడతో పాటు ఇంగ్లీష్ లో తెరకెక్కించడం ఇదే ప్ర ప్రథమం. రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కన్నడ, ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళం, మలయాళంతో సహా పలు భారతీయ, అంతర్జాతీయ భాషల్లోకి డబ్ కానుంది. ఈ ప్రాజెక్టుకి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన గీతూ మోహన్‌దాస్ డైరెక్ట్ చేస్తున్నారు.
కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో సమాంతరంగా ఈ చిత్రాన్ని షూట్ చేస్తున్నారు. ప్రాంతీయ భాషకు వారు ప్రాధాన్యం ఇస్తూనే.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా స్టోరీ కూడా అంతర్జాతీయతకు సంబంధించిన స్టోరీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకున్నాయి.
గీతూ మోహన్‌దాస్ మాట్లాడుతూ..‘విభిన్న భాషా, సాంస్కృతిక నేపథ్యాలలో రాబోతోన్న టాక్సిక్ మూవీని అన్ని భాషల, ప్రాంతాల ఆడియన్స్ అలరించేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అందుకే కన్నడ, ఇంగ్లీష్ లాంగ్వెజెస్ లో తెరకెక్కిస్తున్నామన్నారు. మా ఈ చిత్రం అన్ని సరిహద్దుల్ని చెరిపివేస్తుందని భావిస్తున్నామన్నారు. అన్ని భాషల, సాంస్కృతిక ప్రపంచాన్ని కలిపేలా మా చిత్రం ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
KVN ప్రొడక్షన్స్, యష్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ నారాయణ సంయుక్తంగా నిర్మిస్తూన్న ‘టాక్సిక్’ వరల్డ్ వైడ్ గా ఈ యేడాది చివర్లో రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌తో సహా అనేక అంతర్జాతీయ వేదికలపై అవార్డులు పొందిన గీతూ మోహన్‌దాస్ ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్‌గా లావిష్ గా తెరకెక్కిస్తున్నారు. జాన్ విక్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీలకు పని చేసిన జేజే పెర్రీ యాక్షన్ సీక్వెన్స్ అందిస్తున్నారు. గ్లోబల్ ఆడియెన్స్ దృష్టిలోపెట్టుకొని ఈ సినిమాను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా డ్యూన్ పార్ట్ 2 విజువల్ ఎఫెక్ట్స్‌కి గానూ బాఫ్టా ఫిల్మ్ అవార్డుని అందుకున్న డినెగ్ ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్‌ను అందిస్తూ ఉండటం విశేషం.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజున సందర్భంగా రిలీజ్ చేసిన ‘టాక్సిక్’ టీజర్ ఎన్నో రికార్డుల్ని చెరిపేసింది. టాక్సిక్ ప్రపంచాన్ని ఆ టీజర్ అందరికీ తెలిసేలా చేసింది. ఈ టీజర్ సినిమా స్థాయిని, అంతర్జాతీయ-ప్రామాణికంగా ఎక్కడా కాంప్రమైజ్ కానీ నిర్మాణ విలువలను చాటి చెప్పింది. ఈ టాక్సిక్ చిత్రీకరణ లాస్ట్ ఇయర్ ఆగష్టులో స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో అత్యంత భారీ ఖర్చుతో నిర్మించిన చిత్రాల్లో టాక్సిక్ ఒకటిగా నిలవనుంది.
నిర్మాత వెంకట్ కే నారాయణ మాట్లాడుతూ.. ‘టాక్సిక్’ విషయంలో మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉందన్నారు. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తిండి పోయేలా టాక్సిక్‌ను రూపొందిస్తున్నామన్నారు. మొదటి నుంచీ ఈ కథపై మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఉందన్నారు. వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రేక్షక దేవుళ్లను అలరించే ఉద్దేశ్యంతో ప్రపంచ వేదికపై భారతీయ సినిమా ప్రతిభను కూడా ప్రదర్శించేలా టాక్సిక్ ఉండబోతుదని చెప్పారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









