Yatra 2 Movie: యాత్ర-2లో సోనియా పాత్ర పోషించిన జర్మనీ నటి ఎవరంటే..? ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా..!
Yatra 2 Movie Latest Updates: యాత్ర-2 మూవీ నుంచి జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. సోనియా పాత్రను ఆమె పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుండగా.. 2024 ఫిబ్రవరి 8న ఆడియన్స్ ముందుకు తీసుకున్నారు.
Yatra 2 Movie Latest Updates: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ యాత్ర-2. గత ఎన్నికలకు ముందు వచ్చిన యాత్ర మూవీకి కొనసాగింపుగా ఈ సినిమా రూపొందుతోంది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తుండగా.. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సోనియా గాంధీ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సోనియా గాంధీ పాత్రలో జర్మనీ నటి సుజానే బెర్నెర్ట్ యాక్ట్ చేస్తున్నారు. వైఎస్సార్ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తుండగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్యారెక్టర్‌లో కోలీవుడ్ స్టార్ జీవా యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
సోనియా గాంధీ పాత్రలో నటిస్తున్న సుజానే బెర్నెర్ట్ జర్మనీలో పుట్టి పెరిగారు. ఆమె ఎక్కువగా కమర్షియల్ యాడ్స్, హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ సీరియల్స్‌లో యాక్ట్ చేశారు. సోనియా గాంధీలా ఎలా మెప్పించబోతున్నారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాత్ర-2 మూవీలో సోనియా గాంధీ ఎలా ఉంటుందో తెరపైనే చూడాలని మేకర్స్ అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర. ఆ పాదయాత్ర ఆధారంగా రూపొందించిన మూవీ యాత్ర. ఈ సినిమా 2019 ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయింది. ఇందులో "నేను విన్నాను.. నేను ఉన్నాను.." అంటూ చెప్పిన డైలాగ్ బాగా వైరల్ అయింది. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ డైలాగ్‌తోనే ప్రజలకు చేరువయ్యారు. 2009 నుంచి 2019 వరకు ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాల ఆధారంగా ‘యాత్ర 2’ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఐదేళ్ల క్రితం ఇదే తేదీన యాత్ర విడుదలైంది. మది కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండగా.. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read: Glenn Maxwell: చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడిన మ్యాక్స్‌వెల్.. అఫ్గాన్‌పై ఆసీస్ విజయం
Also Read: CM KCR: నీళ్ల కోసం ఏడ్చినం.. 58 ఏండ్ల దుర్మార్గాలకు కారణం కాంగ్రెస్: సీఎం కేసీఆర్ ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Facebook, Twitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి