
Allu Arjun Atlee Movie Music director : అల్లు అర్జున్.. అట్లీ కలిసి ఓ భారీ బడ్జెట్ సినిమాను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ వీడియో.. ఇది హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కే ప్రాజెక్ట్ అనిపించుకుంది. ఇక అల్లు అర్జున్ అభిమానులను సైతం ఈ వీడియో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో..ఈ చిత్రానికి టెక్నీషియన్స్ ఎంపికపై ఆసక్తికర చర్చలు సాగుతున్న వేళ, మ్యూజిక్ డైరెక్టర్ ఎంపిక వివాదాస్పదంగా మారింది.
ఈ సినిమాకు సాయి అభయంకర్ అనే 20 ఏళ్ల యువ సంగీత దర్శకుడిని తీసుకోబోతున్నారనే.. వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిన్న వయసులోనే ఈ అవకాశం రావడంతో అందరూ తెగ ఆశ్చర్యపోతున్నారు. నెటిజన్లు అతని గురించి వివరాలు వెతకడం మొదలుపెట్టారు.
సాయి అభయంకర్ పేరును సినీ సంగీతంలో పరిచయం అవసరం లేదు. అతను ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్స్ టిప్పు..హరిణి కుమారుడు. టిప్పు పలు తెలుగు సినిమాల్లో హిట్ సాంగ్స్ పాడగా, హరిణి కూడా ప్రముఖ సంగీత దర్శకులతో పని చేశారు. అలాంటి సంగీత కుటుంబంలో పెరిగిన సాయి అభయంకర్ చిన్ననాటి నుంచే మ్యూజిక్ పట్ల ఆసక్తి చూపాడు.
గతేడాది ఆయన కంపోజ్ చేసిన తమిళ పాటలు 'కచ్చిసేరా', 'ఆసై కూడా' యూట్యూబ్‌లో భారీ విజయాన్ని సాధించాయి. ఇవి లక్షలాది వ్యూస్ సాధించడమే కాక, సంగీత ప్రపంచంలో సాయి అభయంకర్కు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చాయి. పాటలు మాత్రమే కాదు, వాటిలో నటించిన కంటెంట్‌కు కూడా మంచి ఆదరణ లభించింది.
ప్రస్తుతం కోలీవుడ్‌లో ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో 'బెంజ్' అనే సినిమాలో సంగీత దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా పెద్ద స్కేల్లో ప్రవేశిస్తున్నాడు. అలాగే సూర్య నటిస్తున్న చిత్రం, మరో ప్రాజెక్టులో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటిస్తున్న సినిమాలు ఉన్నాయి.
ఇలాంటి సమయంలో అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ మూవీ అవకాశం వస్తే.. సాయి అభయంకర్ కెరీర్‌కు మలుపు తిప్పే ఛాన్స్ లేకపోలేదు. సంగీత పరంగా కొత్తతనం, ఇంటర్నేషనల్ టచ్ ఉండే ఈ చిత్రానికి కొత్తతరం సంగీత దర్శకుడు కావాలన్న ఉద్దేశంతోనే మేకర్స్ ఆయనను పరిగణనలోకి తీసుకుని ఉండొచ్చు. ఏదేమైనా ఈ యువ సంగీత దర్శకుడు పేరు తెరపైకి రావడంతో.. కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు తప్పకుండా.. ఆయనది చిత్రానికి మంచి ఫ్రెష్ సంగీతం అందిస్తారు అని ఆనందపడగా.. కొంతమంది మాత్రం ఎందుకు ఇలాంటి ప్రయోగాలు చేయడం అని వాపోతున్నారు. మరి ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి ఎలాంటి సంగీతం ఇస్తారో వేచి చూడాలి.
మరోపక్క అల్లు అర్జున్ చేతిలో త్రివిక్రమ్ సినిమా కూడా ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సుబ్రహ్మణ్యస్వామి జీవిత చరిత్ర చెప్పబోతున్నారని వినికిడి. ఈ సినిమా పైన కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe