Madhuram: 1990 టీనేజ్ లవ్ స్టోరీ 'మధురం'.. ఏప్రిల్ 18న విడుదల

Madhuram Release Date: మధురం మూవీ ఏప్రిల్ 18న ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమైంది. 1990 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే  టీనేజ్ లవ్ స్టోరీ అని.. ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుందని మేకర్స్ చెబుతున్నారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Mar 29, 2025, 08:19 PM IST
Madhuram: 1990 టీనేజ్ లవ్ స్టోరీ 'మధురం'.. ఏప్రిల్ 18న విడుదల

Madhuram Release Date: రాజేష్ చికిలే దర్శకత్వంలో  ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ హీరోహీరోయిన్స్‌గా రూపొందిన చిత్రం మధురం. ఎ మెమొరబుల్ లవ్ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎం.బంగార్రాజు నిర్మించారు. టీనేజ్ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ ముందుకు రానుంది. బస్ స్టాప్ ఫేం కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్ఎం బాబాయ్, దివ్య శ్రీ, సమ్యు రెడ్డి, జబర్దస్త్ ఐశ్వర్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ అవ్వగా.. రీసెంట్‌గా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఏప్రిల్ 18న థియేటర్లలో సందడి మొదలుపెట్టనుంది. ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్ బంగార్రాజు  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారని.. డైరెక్టర్ రాజేష్ అత్యద్భుతంగా తెరకెక్కించారని చెప్పారు. కెమెరామెన్ మనోహర్ ఎక్సలెంట్ ఫోటోగ్రఫీ చేశారని.. మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ అదిరిపోయే సాంగ్స్ ఇచ్చారని మెచ్చుకున్నారు. మధురం ఎ మెమొరబుల్ లవ్.. ఇట్స్ ఎ  క్లీన్ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందన్నారు.  

Add Zee News as a Preferred Source

డైరెక్టర్ రాజేష్ చికిలే మాట్లాడుతూ.. 1990 బ్యాక్‌డ్రాప్‌లో జరిగే  టీనేజ్ లవ్ స్టోరీ అని తెలిపారు. అప్పటి స్కూల్ వాతావరణం, గేమ్స్, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో ప్రస్తుత తరానికి కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించామన్నారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అప్పటి స్కూలు, కాలేజీ రోజులు గుర్తుకువస్తాయన్నారు. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా సినిమా తీశామని.. నిర్మాత బంగార్రాజు తమ వెన్నంటే ఉండి సపోర్ట్ చేశారని అన్నారు. డీఓపీ మనోహర్ బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారని చెప్పారు. 

ప్రొడ్యూసర్ ఎం.బంగార్రాజు మాట్లాడుతూ.. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొంచామని చెప్పారు. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని.. ఏప్రిల్ 18న సినిమా విడుదల చేస్తున్నామని తెలిపారు. నితిన్ రిలీజ్ చేసిన టీజర్‌కు అదిరిపోయే స్పందన వచ్చిందని.. మూవీ కూడా అందరికీ తప్పకుండా నచ్చుతుందన్నారు. హీరోయిన్ వైష్ణవి సింగ్ మాట్లాడుతూ.. ఈ సినిమా తన క్యారెక్టర్ అందరిని అలరిస్తుందన్నారు. ఉదయ్ రాజ్ చాలా సపోర్ట్ చేశారని.. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌లో  తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెప్పారు. 

సాంకేతిక బృందం:

==> కెమెరామెన్: మనోహర్ కొల్లి, 
==> మ్యూజిక్: వెంకీ వీణ, పాటలు; రాఖీ, 
==> ఎడిటర్: ఎన్టీఆర్, 
==> నిర్మాత: ఎం.బంగార్రాజు, 
==> కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజేష్ చికిలే,
==> PRO: జీకే మీడియా (కుమార్, గణేష్).

READ ALSO:  Madhuri Dixit: షాకింగ్.. మాధురి దీక్షిత్ అందానికి మై మరిచిపోయి పెదవులను రక్తం కారేలా కొరికేసిన మాజీ ఎంపీ..

READ ALSO: Star Heroine: హిందువుగా పుట్టి.. ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకొని.. ప్రస్తుతం క్రైస్తవ మతం అనుసరిస్తున్న స్టార్ హీరోయిన్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News