Youtuber anvesh bumper offer to renu desai on dogs row: నా అన్వేషణ యూట్యూబర్ ఇటీవల గరిక పాటి, సీతమ్మ తల్లిపై చేసిన కామెంట్స్ పెద్ద వివాదంగా మారిన విషయం తెలిసిందే. అంతే కాకుండా దీనిపై అన్వేష్ పై పలు పోలీస్ స్టేషన్ లలో కేసులు కూడా నమోదయ్యాయి. దీనిపై నా అన్వేష్ వెనక్కు తగ్గిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఇటీవల రేణు దేశాయ్ వీధి శునకాలను దారుణంగా చంపేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటి రెండు కుక్కలు వైలెంట్ గా ఉంటే, అన్ని శునకాలను చంపడం ఏంటని మండిపడ్డారు. మొత్తంగా వీధి శునకాలు దాడులు చేస్తే స్థానిక ప్రభుత్వాలకు లేదా తనకు చెప్పాలన్నారు. ఈ విధంగా చెబితే వాటిని తీసుకెళ్లి ప్రత్యేకంగా కేజ్ లలో పెడ్తామన్నారు.
మొత్తంగా వీధి శునకాల ఘటన దేశంలోహాట్ టాపిక్ గా మారింది. సుప్రీం కోర్టు కూడా ఇటీవల దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. మనుషులు కూడా అమ్మాయిలపై అత్యాచారాలు , హత్యలు చేస్తున్నారని అంత మాత్రాన అందర్ని చంపుతున్నామా..?.. అంటూ ఫైర్ అయ్యారు. మనుషుల లాగానే వీధి శునకాలను కూడా ఆ దేవుడు పుట్టించాడని ఇలా చంపడం కరెక్ట్ కాదని అన్నారు. మొత్తంగా వీధి శునకాల ఘటనపై యూట్యూబర్ నా అన్వేష్ కూడా రియాక్ట్ అయ్యారు.
రేణు దేశాయ్ కు తన పూర్తి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. అంతే కాకుండా వీధి శునకాల విషయంలో ప్రభుత్వాలు వాటికి తగిన న్యాయం చేయలేవన్నారు. అయితే భారతీయులంతా కలిసి ఫండ్స్ కలెక్ట్ చేద్దామన్నారు. అంతే కాకుండా దీనికి తన వంతుగా కూడా సాయం అందిస్తానన్నాడు. దీనికి ఇతర దేశాల నుంచి కూడా తాను వీడియో తీసి కావాలంటే ఫండ్స్ కోసం అడుగుతానంటూ యూట్యూబర్ నా అన్వేష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక నుంచి వీధి కుక్కలు బైట తిరక్కుండా దేశ వ్యాప్తంగా ఎక్కడిక్కడ ప్రత్యేంగాషెడ్స్ లను ఏర్పాటు చేద్దామని కూడా అన్వేష్ చెప్పుకొచ్చాడు.
Read more: Sumanth: నా మాజీ భార్యతో ఇప్పటికి ఆ పనిచేస్తా.!. షాకింగ్ నిజం బైటపెట్టిన సుమంత్..
మరోవైపు రేణు దేశాయ్ మీద ఇటీవల యూట్యూబర్ ప్రశంసలు కురిపించాడు. అంతే కాకుండా రేణుదేశాయ్ కు స్పీచ్ 2026 లో హైలెట్ అని అన్నాడు. మరోవైపు రేణు దేశాయ్ లో శివాజీ మహరాజ్ పూనినట్లు అన్పించిందని అన్వేష్ మాట్లాడాడు. మొత్తంగా నా అన్వేష్ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.









