Youtuber naa anvesh supports renu desai on dogs killing row: నటి రేణు దేశాయ్ ఇటీవల హైదరాబాద్ లోని సోమాజిగూడలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అంతే కాకుండా వీధికుక్కల్ని చంపడంపై ఆమె సీరియస్ గా మాట్లాడారు. వంద కుక్కలలో నాలుగో, ఐదో శునకాలు కరుస్తాయని, అన్నింటిని చంపడం ఏంటని మండిపడ్డారు. అంతే కాకుండా.. శునకాలు కన్పిస్తే తమకు చెప్పాలని వాటిని తీసుకెళ్లి పోతామన్నారు. అదే విధంగా ఇతర అధికారులు జీహెచ్ఎంసీకి అయిన చెప్పాలన్నారు. మొత్తంగా కొంత మంది అమ్మాయిలపై అత్యాచారాలు చేస్తారు, చంపేస్తారు.. వారిని మనం చంపుతున్నామా..?.. అందర్ని చంపేస్తున్నామా.. అంటూ ఫైర్ అయ్యారు.
ఈ ఘటనపై తనగురించి కొంత మంది పర్సనల్గా ట్రోల్స్ చేస్తున్నారని, తాను రాజకీయాల్లోకి రావడంలేదని క్లారిటీ ఇచ్చారు. దయచేసి తన పిల్లల గురించి చెడు ప్రచారం చేయోద్దన్నారు. మొత్తంగా నటి రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మరోవైపు రేణు దేశాయ్ కు ప్రపంచయాత్రికుడు నా అన్వేష్ అండగా నిలిచాడు. గతంలో నా అన్వేష్ సోషల్ మీడియాలో గరిక పాటి, సీతమ్మ తల్లి పై కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అతనిపై కేసులు కూడా నమోదయ్యాయి. మొత్తంగా అన్వేష్ నటి రేణు దేశాయ్ కు తన మద్దతు తెలియజేశారు. నా అన్వేష్ మాట్లాడుతూ.. 2026కి ఇదే బెస్ట్ స్పీచ్ అంటూ రేణు దేశాయ్‌ను ప్రశంసించారు. దేశంలో అవినీతి గురించి భయపడకుండా మాట్లాడారన్నారు.
Read more: Renu Desai Video: నా బిడ్డ ప్రాణాలు పోవాలా..?.. భావోద్వేగానికి గురైన రేణు దేశాయ్.. వీడియో వైరల్..
రేణు దేశాయ్ ను చూస్తుంటే.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన్ని పూనినట్లు అన్పించిందన్నారు. మొత్తంగా వ్యవస్థలోని అన్ని అంశాలపై రేణు దేశాయ్ మాట్లాడిన మాటలు చాలా ఆలోచింపచేశాయన్నారు. భారత్ లో బాగా అవినీతి పెరిగిపోయిందని, వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని నా అన్వేష్ మాట్లాడాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









