ZEE 5 - Mazaka Streaming: దేశీయంగా అతిపెద్ద ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా జీ5కు ప్రత్యేక స్థానం ఉంది. డిఫరెంట్ కంటెంట్ ను దేశీయంగానే వివిధ భాషల్లో అందిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. తాజాగా ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో వెంకటేష్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా స్ట్రీమింగ్ చేసింది. అది జీ5లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఉగాది కానుకగా సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మజాకా’ చిత్రం మార్చి 28న స్ట్రీమింగ్ కు రానుంది. ఫిబ్రవరి 26న రిలీజ్ అయిన ఈ చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. నవ్వుల బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ప్రస్తుతం జీ5 ఓటీటీలోకి వచ్చేందుకు రెడీగా ఉంది.
సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమా థియేట్రికల్ గా ఓ మోస్తరు రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇపుడు జీ5 ఓటీటీలోకి ఈ నెల 28న స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సినిమాతో జీ5 వీక్షకులు ఉగాది నవ్వుల బ్లాక్ బస్టర్‌తో జరుపుకోబోతోన్నారు. ఆల్రెడీ జీ5లో రీసెంట్‌గానే సంక్రాంతికి వస్తున్నాం, మ్యాక్స్, కుడుంబస్తన్ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్‌లు గా మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతోన్నాయి.
ప్రస్తుతం జీ5లో సంక్రాంతికి వస్తున్నాం, మ్యాక్స్, కుడుంబస్తన్ వంటి చిత్రాలు టాప్‌లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఉగాది సందర్భంగా ‘మజాకా’ రాకతో వినోదం రెట్టింపు కానుంది. నవ్వుల బ్లాక్ బస్టర్‌ను చూసి ఈ ఉగాదికి అందరూ ఎంజాయ్ చేయండి.
ZEE5 గురించి...
జీ5 భారతదేశపు అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీ లింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. జీ5 ఓటీటీలో 3,500 సినిమాల లైబ్రరీ ఉంది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప లైబ్రరీ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ఆడియన్స్ అందించగలుగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









