Zee Telugu: గత సంవత్సరం మొత్తం జీ తెలుగు.. ప్రేక్షకులను సరికొత్త కాన్సెప్తులతో తెగ ఎంటర్టైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే ఫాలో అవుతూ 2025వ సంవత్సరం కూడా ఎన్నో సీరియల్స్ తో అలానే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ తో సిద్ధమైపోయింది జి. ఈ క్రమంలో ముఖ్యంగా డిసెంబర్ 31వ తేదీ రాత్రి మరింత వినోదం పంచే కార్యక్రమాలతో రానంది.
అనునిత్యం వినోదం పంచే కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు మరిన్ని వినోదభరిత కార్యక్రమాలతో… 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూనే, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. ఇటీవల ఖమ్మంలో ఘనంగా జరిగిన ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ కార్యక్రమాన్ని డిసెంబర్ 31, రాత్రి 10 గంటలకు ప్రసారం చేయనుంది. ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్లతో సాగే సీరియల్స్ అందిస్తున్న జీ తెలుగు మరో ఆకట్టుకునే అంశంతో సాగే చామంతి సీరియల్ను నూతన సంవత్సర కానుకగా అందిస్తోంది. ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ డిసెంబర్ 31 ప్రచారం కానుండగా.. సరికొత్త సీరియల్ చామంతి జనవరి మొదటి తారీఖు నుండి..ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు, మీ జీ తెలుగులో ప్రచారం కానుంది.
ఇటీవల ఖమ్మం వేదికగా..జీ తెలుగు నిర్వహించిన న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ సరిగమప పార్టీకి వేళాయెరా కార్యక్రమాన్ని 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ప్రసారం చేస్తోంది. యాంకర్ రవి, లాస్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సరిగమప గాయనీగాయకులు జీ తెలుగు సీరియల్ నటీనటులతో పోటీపడ్డారు. మేఘసందేశం సీరియల్ నుంచి గగన్ (అభినవ్), భూమి (భూమిక), నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి అమరేంద్ర (రిచర్డ్ జోస్), అరుంధతి (పల్లవి గౌడ), భాగమతి(నిసర్గ గౌడ), చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ నుంచి మిత్ర (రఘు), లక్ష్మి (మహి గౌతమి) తదితరులు పాల్గొని అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. హృదయాన్ని హత్తుకునే పాటలు, ఉల్లాసకరమైన ఆటలు, అద్భుతమైన ప్రదర్శనలతో కార్యక్రమం ఆద్యంతం కోలాహలంగా సాగింది. పాటల పోటీలు, కామెడీ స్కిట్లు, అందాల పోటీలు నిర్వహించడమే కాకుండా ఈ వేదికపై ప్రతిభావంతులైన దివ్యాంగులను ప్రోత్సహించింది జీ తెలుగు. 2024 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు పలుకుతూ అభిమానుల కోలాహలంతో సాగిన ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకు డిసెంబర్ 31 రాత్రి అందించనుంది జి.
ఇక చలాకీ అమ్మాయి అయిన చామంతి(మేఘనా లోకేష్) తన కుటుంబంతో ఊరిలో జీవిస్తుంది. చామంతి కుటుంబం ఆ ఊరిలో జమీందారీ ఇంట్లో నమ్మకంగా పని చేస్తుంది. చామంతి తండ్రి - రామచంద్రయ్య (ప్రభాకర్), తల్లి మూగ. చామంతి అక్క రోజా వాయుపుత్ర ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తుంది. ఇక జమీందారీ కుటుంబ సహాయంతో ఎదిగిన వ్యక్తి వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఎండీ హర్షవర్ధన్. అరుణ్, ప్రేమ్ హర్షవర్ధన్ వారసులు. పల్లెటూర్లో ఉండే చామంతి హైదరాబాద్ ఎలా చేరుకుంది? చామంతి, ప్రేమ్ మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది? రోజా హర్షవర్ధన్ ఇంటికి ఎలా చేరుకుంటుంది? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే చామంతి సీరియల్ చూడాల్సిందే. ప్రతిభావంతులైన నటీనటులు, ఆకట్టుకునే కథాంశంతో చామంతి సీరియల్ ప్రేక్షకులను అలరించనుంది. మేఘనా లోకేష్, ఆశిష్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్లో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, మౌనిక, భార్గవ్ రామ్, ఐశ్వర్య, శశిధర్, శ్రియ రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: KT Rama Rao: నన్ను జైలుకు పంపడమే రేవంత్ రెడ్డి లక్ష్యం.. అవినీతి లేదు ఏం లేదు
Also Read: Harish Rao: హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్‌ను కంటతడి పెట్టించింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









